హైదరాబాద్ లో క్రితంరోజు మధ్నాహ్నం అదృశ్యమైన యువతి కథ సుఖాంతమైంది. 24 గంటల కూడా తిరగకుండానే పోలీసులు అమె ఆచూకిని తెలుసుకుని.. అమెను తీసుకువచ్చి అమె తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తీవ్ర కలకలం రేపిన యువతి అదృశ్యమైన కేసు సుఖాంతం కావడంతో పోలీసులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. వరుసగా మహిళలు, యువతులపై జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గాయత్రిని సురక్షితంగా అమె తల్లిదండ్రులకు అప్పగించారు. యువతిని విషయంలో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటకు చెందిన గాయత్రి అనే యువతి స్థానిక రత్నదీప్ సూపర్ మార్కెట్ లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తోంది. విధులకు హాజరయ్యేందుకు వెళ్తానని చెప్పి నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన ఆమె.. సాయంత్రం అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాయత్రికి ఫోన్ చేయగా..స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే యువతి పనిచేస్తున్న స్టోర్కు ఫోన్ చేయగా..అసలు గాయత్రీ విధులకు హాజరుకాలేదని తెలిసింది. దీంతో కంగారుపడిన యువతి తల్లిదండ్రులు గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరేసగా మహిళలు, యువతులపై జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అప్పమత్తమైన పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. అమె వెళ్లిన సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించి.. ఆమె సెల్ ఫోన్ ఆధారాంగా తక్కువ సమయంలోనే గాయత్రి ఆచూకీని గుర్తించారు. కేపీహెచ్ బీలోని సర్దార్ పటేల్ నగర్ లో గాయత్రిని పోలీసులు గుర్తించి.. సురక్షితంగా దుండిగల్ పీఎస్ కు తీసుకొచ్చారు. కాగా గాయత్రి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది... ఇంట్లో చూసిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతోనే గాయత్రి ఇల్లు వదిలి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు గాయత్రి తన తల్లిదండ్రులకు ఒక లేఖను కూడా రాసిపెట్టిందని తెలిపారు. తనను వెతకొద్దని.. అంతేకాదు తాను మిస్ అయినట్టు పోలీసులకు కూడా పిర్యాదు చేయవద్దని తన తల్లిదండ్రులను లేఖలో కోరింది గాయత్రి. గాయత్రి రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు... ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. అయితే, గాయత్రి తల్లిదండ్రులు ఫిర్యాదుతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన దుండిగల్ పోలీసులు... సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా గాయత్రి కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు అమెను కేపీహెచ్ బి లోని సర్ధార్ వల్లభబాయ్ పటేల్ నగర్ కాలనీ నుంచి తీసుకువచ్చి అమె తల్లిదండ్రులకు అప్పగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more