UK company grants workers hangover days ఉద్యోగులకు ‘‘హ్యంగోవర్ లీవ్’’.. అందుబాటులోకి తెచ్చిన బాస్..

Uk company lets hungover employees take work from home to increase efficiency

Holiday Season, Drunk, Drinking, Drinking During Holidays, Hangover, Hangover Offs, Hangover Days Off, UK Company Hangover Days, Hungover Days, Hangover Cure After Holidays

With a view to promoting work efficiency of employees, a UK-based digital marketing company has introduced ‘work from home’ facility if they’re feeling hung-over after partying too hard. The company, Audit Lab, is headquartered in Bolton, United Kingdom.

ఉద్యోగులకు ‘‘హ్యంగోవర్ లీవ్’’.. అందుబాటులోకి తెచ్చిన బాస్..

Posted: 12/17/2019 03:48 PM IST
Uk company lets hungover employees take work from home to increase efficiency

ఈ సారు తన ఉద్యోగులను అర్థం చేసుకునేవారు.. అంతేకాదు.. వారి నుంచి ఎలా ఉత్తమ ఫలితాలను సాధించాలో కూడా తెలిసిన వారు. ఈ విషయాన్ని మేము చెప్పడం కాదు.. ఏకంగా వారి ఉద్యోగులే చెబుతున్నారు. మారుతున్న కాలంతో పాటు ఉద్యోగుల అవసరాలను అర్థం చేసుకుని వారికి సెలవులను మంజూరు చేస్తూ అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. నిజమా.? అలాంటి బాసులు కూడా వున్నారా.? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారా.? నిజమే. అదేంటి మా బాస్ కూడా సెలవు అడిగితే ఇస్తారని అంటున్నారా.?

 రాత్రి మందెక్కువైంది.. మత్తుగా ఉంది.. మంచం దిగబుద్ది కావట్లే.. ఈరోజు సెలవిస్తారా.. అని మీ బాస్ ను అడిగితే సెలవు ఇస్తారా.? కనీసం ఇలా ఎప్పుడైనా మీ బాస్‌కి ఫోన్ చేసి సెలవు అడిగే ధైర్యం చేశారా.. సెలవు సంగతి అటుంచితే.. ఉద్యోగం ఊఢుతుందోమోనని భయం పట్టుకుంటుందా.? కానీ ఇక్కడి బాస్ మాత్రం తన రూటే సెపరేటు. తాను అందరి బాసుల్లా కాదుని  అని నిరూపించుకుంటున్నారు. ఎలా అంటే.. నిజంగా లేట్ నైట్ పార్టీలో మందుఎక్కువై.. హ్యాంగోవర్ తో బాధపడుతుంటే.. అదే విషయాన్ని చెప్పినా.. లీవ్ మంజూరు చేస్తారు. ఇక మత్తు దిగింతరువాత ఇంటి నుంచే వర్క్ చేయమనే వెసులుబాటూ కల్పిస్తారు.

వాయువ్య ఇంగ్లాండ్‌లో గల అడిట్ ల్యాబ్ అనే డిజిటల్ మార్కెటింగ్ సంస్థ ‘హ్యాంగోవర్ డే’ సెలవును అందుబాటులోకి తెచ్చింది. రాత్రంతా పార్టీలో ఎంజాయ్ చేసి, ఆనక ఓ పెగ్గు ఎక్కువేసి మత్తుగా పడుకున్నారనుకోండి. ఉదయాన్నే బద్దకంగా ఆఫీసుకి వస్తే.. హ్యాంగోవర్ లో వుండి ఆఫీసుకు వచ్చి.. మీ నిరుత్సాహాన్ని ఇతర ఉధ్యోగులపై రుద్దడం.. ఆపీసులో పని వాతావరణాన్ని పాడు చేయడం మినహా మీరు ఇంకేమీ చేయలేరు.. అందుకనే హ్యాపీగా సెలవు తీసుకుని.. హ్యాంగోవర్ దిగిన తరువాతే ఆఫీసుకు రండీ అంటోంది సంస్థ.

మారుతున్న కాలంతో సేవా రంగంలో వున్న కంపెనీల ఉధ్యోగులు మందు కొట్టడం కామన్. అయితే అనుకోని పరిస్థితుల్లో పీకల వరకు మందు తాగేసి..  హ్యాంగోవర్ తో కార్యాలయాలకు రావడం కన్నా.. గంటా.. రెండు గంటలు అధికంగా పడుకుని హ్యాంగోవర్ దిగిన తరువాత ఇంటి నుంచే ఆ రోజు మాటుకు పనిచేసే వెసలుబాటు కల్పించడం ద్వారా పనికూడా జరుగుతుంది.. ఆఫీసు వాతావరణం బాగుంటుందని అంటున్నారు.. ఆడిట్ ల్యాబ్ సహభాగస్వామి, కంపెనీ డైరెక్టర్ క్లేర్ క్రాంప్టన్. ఇదే విషాయాన్ని అయన వద్ద ప్రస్తావించగా, అదేం లేదు. మరే కారణం చేతైనా రాత్రి ఎక్కువ సేపు మేల్కొని, ఉదయాన్నే నిద్ర లేవలేకపోయినా సెలవు తీసుకోవచ్చంటున్నారు సంస్థ యజమానులు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మందు బాబులంతా ఆహా! మాక్కూడా ఇలాంటి అవకాశం ఉంటే ఎంత బావుండు అని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles