Teen sends hoax mail about bomb at Salman House సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబు.. పోలీసులకు సవాలు..

Up teen threatens with impending bomb blast in salman khan s house

Bollywood Actor, Salman Khan, Galaxy apartment, bomb blast hoax mail, mumbai police, bandra police, band stand, Ghaziabad, Uttar Pradesh

Salman Khan's Galaxy apartments recently became a high security zone after Mumbai Police recived an hoax email telling them that a bomb was scheduled to go off within the next two hours. A boy has been booked from Uttar Pradesh's Ghaziabad for sending a mail to the Bandra police station.

సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబు.. పోలీసులకు సవాలు..

Posted: 12/14/2019 04:41 PM IST
Up teen threatens with impending bomb blast in salman khan s house

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంట్లో బాంబుందన్న సమాచారం అందడంతో.. ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. ఒక్కసారిగా సల్మాన్ ఖాన్ నివాసముండే గ్యాలక్సీ అపార్టుమెంట్ల ప్రాంతమంతా హై సెక్యూరిటీ ప్రాంతంగా మారిపోయింది. అందుకు కారణం మరో రెండు గంటల్లో బాంబు పేలిపోతుందని.. చెప్పడమే. దీంతో పోలీసులు అప్రమత్తమై అనువనువూ గాలించి ఏ బాంబు లేదని.. నిర్థారించుకున్న తరువాత ఊపిరిపీల్చుకున్నారు. అయితే తమకు ఈ తప్పుడు సమాచారం అందించిన వ్యక్తి ఎవరని ఆరా తీశారు.

తీరా ఆ యువకుడు పదహారేళ్ల బాలుడని.. పోలీసులకు నకిలీ ఈ మెయిల్‌ పంపించి పరుగులు పెట్టించాడని తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని బాంద్రా ఏరియాలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని సల్మాన్‌ఖాన్‌ ఇంట్లో పెట్టిన బాంబు రెండు గంటల్లో పేలనుందని, ఆపే సత్తా ఉంటే ఆపుకోమని బాంద్రా పోలీస్‌ స్టేషన్‌కు ఈ నెల 4న ఈమెయిల్ లో సవాల్‌ విసిరాడు. మెయిల్‌ చూసిన పోలీసులు హుటాహుటిన బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో కలిసి సల్మాన్‌ ఇంటికి వెళ్లి చెక్‌ చేశారు. దాదాపు నాలుగుగంటల పాటు అణువణువూ గాలించారు.

ఆ సమయంలో సల్మాన్‌ ఇంట్లో లేరు. ఇంట్లో ఉన్న సల్మాన్‌ తండ్రి సలీమ్‌ను, సోదరి అర్పితను పోలీసులు ముందే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు బాంబు దొరక్కపోవడంతో నకిలీ ఈ మెయిల్‌గా భావించి, మెయిల్‌ ఆధారంగా బాలుడిని ఘజియాబాద్‌ ప్రాంతవాసిగా గుర్తించారు. అనంతరం పోలీసుల బృందం నిందితుడి కోసం ఘజియాబాద్‌కు వెళ్లగా, భయపడిన బాలుడు స్థానిక టిస్‌ హజారీ కోర్టులో దాక్కున్నాడు. దీంతో న్యాయవాది అయిన బాలుడి సోదరుడిని కలిసిన బాంద్రా పోలీసులు అతని ద్వారా బాలుడిని ఒప్పించి ఇంటికి రప్పించారు. తర్వాత పోలీసుల ముందు హాజరు కావాల్సిందిగా కోర్టు ఇచ్చిన నోటీసును అతనికి చూపించి తమ వెంట తీసుకెళ్లి విచారించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతడిని విడిచిపెట్టామని పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood Actor  Salman Khan  Galaxy apartment  bomb blast hoax mail  Ghaziabad  UP  Crime  

Other Articles