No place for caste in Christianity: Pawan Kalyan మతం మారిన వైఎస్ జగన్ కు కులం ఎక్కడిది.?: పవన్ కల్యాణ్

Why you want caste when you changed religion pawan kalyan

Pawan Kalyan, JanaSena, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, government building colour change, Gandhi statue colour change, Religion, caste, Chirstianity, HInduism, colourism, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

The Janasena party chief Pawan Kalyan says How come caste exists for a person, or family if he changes his religion.?. YS Jagan has changed his religion, how can claim that he belongs to Reddy community questions pawan kalyan.?

ITEMVIDEOS: మతం మారిన వైఎస్ జగన్ కు కులం ఎక్కడిది.?: పవన్ కల్యాణ్

Posted: 12/03/2019 10:28 AM IST
Why you want caste when you changed religion pawan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోమారు వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టార్గెట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్.. దృష్టిలో అన్ని కులాలు, మతాలు ఒక్కటిగా వుండాలని, సమానంగా చూడాలని సూచించిన ఆయన.. ఉన్నతమైన పదవిలో వుంటూ.. కుల ప్రస్తావన చేయడంపై విమర్శలు గుప్పించారు. ‘‘నా కులం.. మాట తప్పని కులం’’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేయడంపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ అసలు మతం మారాక కులం ఎక్కడి నుంచి వచ్చిందండీ జగన్ గారికీ’ అని ఆయన ప్రశ్నించారు.

మతం మారాక మీకు కులమెందుకండీ... కుల ప్రస్తావన ఎక్కడ ప్రాధాన్యముంటుందని నిలదీసిన ఆయన ఇకనైనా కులాన్ని వదిలేయాలని వ్యాఖ్యానించారు. ‘‘నా మత విశ్వాసం ఇది, నా కులం ఇది’’ అని జగన్ రెడ్డి మాట్లాడుతుంటారని... ఆయనకు ఒకటే చెప్పాలనుకుంటున్నానని... మతం మారాక కులం ఎలా వుంటుందని.. ప్రశ్నించారు. కులం కావాలి, మతం కావాలి, ఓట్లు కావాలి, డబ్బులు కావాలి, అన్నీ కావాలి అని ఎద్దేవా చేశారు. సమాజం మారింది, యువత మారింది... కానీ, రంగులే మారడం లేదని చెప్పారు. తిరుమల కొండకు తప్ప అన్నింటికీ రంగులు మార్చారని ఎద్దేవా చేశారు. వైసీపీ అంటేనే రంగుల రాజ్యమని పవన్ కల్యాణ్ విమర్శించారు.

క్రిస్టియానిటీని అనుసరిస్తున్నవారికి కులం ఉండదని పవన్ కల్యాణ్ చెప్పారు. మతం మీద విశ్వాసం ఉన్నవారు చెట్టుకు కూడా హాని తలపెట్టరని... కానీ, జగన్ రెడ్డి చెట్లను నరికించేస్తారని అన్నారు. తిరుమలను గౌరవించాలని, అక్కడ అన్యమత ప్రచారం జరగకూడదని చెప్పారు. రాజ్యంగం స్వేచ్ఛ ఇచ్చింది కదా అని ఎలా పడితే అలా చేయకూడదని అన్నారు. రెచ్చగొట్టే పనులు చేస్తే గొడవలు అయిపోతాయని చెప్పారు. తన మతం హిందూ మతమని... అన్ని మతాలను గౌరవించాలని తన మతం చెబుతోందని అన్నారు. ఏ మతం వారు ప్రసాదం ఇచ్చినా తాను స్వీకరిస్తానని చెప్పారు. అన్ని మతాల్లో గొప్పదనం ఉంటుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles