TDP MLA Atchannaidu met with road accident అచ్చెన్నాయుడికి ప్రమాదం.. గాయాలతో భయటపడ్డ టీడీపీ నేత

Tdp mla atchannaidu met with road accident in visakhapatnam

Atchennaidu, TDP MLA, former minister, road accident, nakkapalli, visakhapatnam, andhra pradesh, crime

Former minister and TDP leader K. Atchannaidu met with a road accident when he was travelling in a car on the highway near Nakkapalli in Visakhapatnam.

అచ్చెన్నాయుడికి ప్రమాదం.. గాయాలతో భయటపడ్డ టీడీపీ నేత

Posted: 11/30/2019 11:19 AM IST
Tdp mla atchannaidu met with road accident in visakhapatnam

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో అచ్చెన్నాయుడి చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కారులో ఉన్న గన్ మన్ సహా మరికొందరికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

నిన్న గుంటూరులోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు ప్రమాద వార్త తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యారు. టీడీపీ దివంగత నేత, పార్లమెంటు సభ్యుడు ఎర్రంనాయుడు కూడా రోడ్డు  ప్రమాదంలోనే మరణించాడని తెలసి అచెన్నాయుడు అనుయాయువులు అందోళనకు గురయ్యారు. అయితే, ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atchennaidu  TDP MLA  former minister  road accident  nakkapalli  visakhapatnam  andhra pradesh  crime  

Other Articles