MP: Congress MLAs going missing ఆ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడా.?

Jyotiraditya scindia on reports of madhya pradesh congress mlas going missing

Jyotiraditya Scindia, Jyotiraditya Scindia news, Congress Mlas, Missing, Rumour, BJP Mind Game, Madhya Pradesh, Madhya Pradesh news, Madhya Pradesh MLAs, Jyotiraditya Scindia MLAs, Madhya Pradesh, Politics

Madhya Pradesh Congress leader Jyotiraditya Scinida rubbished rumours of some Congress MLAs being "missing" or "untraceable" in the state. "This [the rumour] is utter rubbish. Who is missing, tell me the name, I will make you talk to him or her," Scindia told

ఆ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడా.?

Posted: 11/25/2019 05:03 PM IST
Jyotiraditya scindia on reports of madhya pradesh congress mlas going missing

మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం మారుతూ ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని మరో విషయం కలవర పెట్టింది. ఇటు మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలను సరిదిద్దేందుకు పోరాడుతున్న క్రమంలోనే అటు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారని వదంతులు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర ఉలిక్కపడింది. ఏకంగా 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారని పుకార్లు షికార్లు చేశాయి. నిజానిజాలను నిర్థారించుకోకుండానే ఈ వార్త రాజకీయ వర్గాల నుంచి మీడియాకు పోక్కి దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది.

అయితే ఈ పుకారు పుట్టడానికి కూడా మీడియానే కారణమా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. హిందీ దినపత్రిక ‘నవభారత్‌ టైమ్స్‌’ లక్నో రెసిడెంట్‌ ఎడిటర్‌ సుధీర్‌ మిశ్రా.. ఈ మేరకు తొలుత ట్వీట్ చేశారని.. దాంతోనే వదంతులు వ్యాపించాయని తెలుస్తోంది. ‘బ్రేకింగ్‌ న్యూస్ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ..: మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా అనుచరవర్గమైన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్పింగ్ అయ్యారంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా.. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ రెండు రోజుల నుంచి ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేగింద’ని ఆయన ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత గంటలోపు ఈ ట్వీట్‌ను తొలగించారు.

ఇలోగా ఆయన ట్వీట్ చేయాల్సిన డ్యామేజీని చేసేసింది. అప్పటికే అటు రాజకీయ ప్రముఖులతో పాటు ఇటు ఆ పార్టీ ప్రముఖ్యులను ఉలిక్కపడేట్లు చేసింది. ఇక అందివచ్చిన అవకాశాన్ని వదులుకోని బీజేపి దీనిపై వెనువెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి కమల్ నాథ్‌ పనితీరుపై సింధియా, ఆయన మద్దతుదారులు అసంతృప్తిగా ఉన్నారని, ఏదోక సమయంలో వీరంతా తిరుగుబాటు చేసే అవకాశముందని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్‌ హితేశ్‌ వాజపేయి జోస్యం చెప్పారు. ఇక అదే సమయంలో జ్యోతిరాధిత్య సింధియా ఇవాళ ఉదయమే చేసిన మరో పని కూడా అనుమానాలకు దారి తీసింది.

జ్యోతిరాధిత్య ఇవాళ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఇదివరకు తాను కాంగ్రెస్ నేతను అన్న క్యాప్షన్ వుండేది. కాగా, ఇవాళ ఉదయం మాత్రం ఆయన ఆ క్యాప్షన్ ను తొలగించారు. జ్యోతిరాదిథ్య సిందియా అని మాత్రమే ట్విట్టర్ ఖాతాలో పోందుపర్చారు. దీంతో ఆయన నిజంగానే పార్టీని వీడుతున్నారా.? కమల్ నాథ్ ప్రభుత్వానికి కూడాపదవీ గండం పోంచివుందా.? అన్న అనుమానాలు రేకెత్తాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారని వచ్చిన వార్తలను జ్యోతిరాదిత్య సింధియా కొట్టిపారేశారు. ‘ఈ వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఎవరు అదృశ్యమయ్యారో చెప్పండి. వాళ్లతో మాట్లాడిస్తాన’నని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyotiraditya Scindia  Congress Mlas  Missing  Rumour  BJP Mind Game  Madhya Pradesh  Politics  

Other Articles