video viral: Lady sarpanch climbs over JCB మహిళా సర్పంచ్ సాహసం.. వీడియో వైరల్..

Woman sarpanch stands her ground and wins showdown with excavator

lady sarpanch climbs on jcb machine, jalore, anti-encroachment drive, rajasthan, rajasthan anti-encroachment drive, lady sarpanch, woman sarpanch, rekha devi, mandawala village, land encrochment, Jalore, Sarpanch, JCB Machine, Rajasthan, Crime

The local village elder in Jalore, Rajasthan is clearly a leader who believes that actions speak louder than words, so much so that she faced off against a mechanical excavator that had come to demolish local settlements.

ITEMVIDEOS: వైరల్: కూల్చివేతలను మహిళా సర్పంచ్ ఏలా అడ్డుకుందంటే..

Posted: 11/23/2019 11:07 AM IST
Woman sarpanch stands her ground and wins showdown with excavator

తమ ప్రభుత్వం పేదల కోసమే.. పేదల పక్షానే అంటూ పలు పార్టీల రాజకీయ నాయకులు సమయం, సందర్భం లేకుండా అవకాశం దొరికినప్పుడల్లా ఊదరగోడుతుంటారు. కానీ నిజానికి పేదలకు పనిపడి వెళ్తే కనీసం గుమ్మం వద్దకు కూడా చేరడానికే ఎన్నో అడ్డంకులు దాటుకుని వెళ్లాల్సి వస్తుంది. కానీ ఆ గ్రామంలోని మహిళా సర్పంచ్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. మగమహారాజులైన వారికే సాధ్యంకానీ రీతిలో అమె చేసిన సాహసం.. పేదల ఇళ్లను కూల్చివేత నుంచి పరిరక్షించింది. ఇది నిజంగా పేదల పక్షాన నిలవడమంటే అంటూ నెట్ జనులు అమెకు నిరాజనాలు పలుకుతున్నారు.

రాజస్థాన్ లో గ్రామ పంచాయితీకి చెందిన భూమిని అక్రమించుకునేందుకు ఓ భూబకాసురుడు కన్ను వేశాడు. అయితే దానిని గుర్తించిన గ్రామ మహిళా సర్పంచ్ అక్కడి నిర్మాణాలను కూల్చివేసింది. ఆ స్థలంలో గ్రామంలోని నిరాశ్రయ పేదలకు ఇంటిస్థలాలను కేటాయించింది. ఇది జరిగిన కొన్నేళ్ల తరువాత తాజాగా అక్కడి స్థలం తనదని, పేదలు అక్రమంగా తన భూమిని అక్రమించారని పేర్కోంటూ వాటిని కూల్చివేసేందుకు జేసీబీలతో సహా వచ్చిన ఓ భూబకాసురుడ్ని మహిళా సర్పంచ్ అడ్డుకోగలిగింది.

జేసీబీని ముందుకు కదలనివ్వకుండా.. అమె చేసిన సాహసంతో బిత్తరపోయిన భూబకాసురుడు.. వెనక్కుతగ్గాల్సి వచ్చింది. ఇంతకీ మహిళా సర్పంచ్ చేసిన ఆ సాహసం ఏంటి..? అంటే.. కూల్చివేతలకు ముందుకువస్తున్న జేసీబీని మిషెన్ హ్యాండ్ ను పట్టుకుని వేలాడింది. డ్రైవర్ కిందకు మీదకు చేస్తున్నా అమె దానిని వదలకుండా గట్టిగా పట్టుకుని.. పేదల ఇళ్లు కూల్చాలంటే.. తనపై నుంచే జేసీబి వెళ్లాలని హుంకరించడమే కాకుండా అన్నంత పని చేసింది. దీంతో భూబకాసురుడు వెనక్కతగ్గకతప్పలేదు. ఈ క్రమంలో అమెకు ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లేదు.

కాగా, ఈ వీడియోను అడ్డుకున్న స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ద్వారా అది కాస్తా వైరల్ అవుతోంది. అమెకు నెట్ జనులు నిరాజనాలు పలుకుతున్నారు. ఈ ఘటన రాజస్థాన్ లోని మంద్వాలా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. తమ గ్రామంలోని పంచాయితీకి చెందిన భూమిని వాఘా రామ్ అనే వ్యక్తి అక్రమిస్తున్నారని గ్రామ సర్పంచ్ రేఖా దేవీ పిర్యాదు చేశారని తెలిపారు. వాఘారామ్ కోసం పోలీసులు అన్వేషణ సాగిస్తున్నా.. అయన పరారీలో వున్నారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles