IRCTC announces Tirumala srivari package గుడ్ న్యూస్: హైదరాబాదీ తిరుమల వెంకన్న భక్తులకు మాత్రమే..

Good news to venkanna devotees as irctc announces tirumala package

tirumala srivaru, tirumala venkanna, tirumala tirupati devasthanam, IRCTC, Indian Railway catering and tourism corporation, tirumala special darshan, tirumala break darshan, Tirumala Tirupati Devasthanam, Srivaru, Venkanna, Lord Venkateshwara, SriVari Darshan, IRCTC, Break Darshan, Site-seeing, Tirumala, Tirupati, IRCTCIndian Railway, IRCTC tour package, IRCTC special package, Andhra Pradesh, Politics

Indian Railway catering and tourism corporation gives a good news to Tirumala SriVari devotees, It announces Tirumala Srivari package for Hyderabadi devotees with break darshan and site seeing.

గుడ్ న్యూస్: హైదరాబాదీ తిరుమల వెంకన్న భక్తులకు మాత్రమే..

Posted: 11/18/2019 03:42 PM IST
Good news to venkanna devotees as irctc announces tirumala package

కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది చెందిన పవిత్ర పుణ్యధామం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే భక్తుల సంఖ్య దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో తిరుమలను సందర్శించే భక్తులతో వడ్డీకాసులవాడి దర్శనానికి కూడా గంటల కొద్ది సమయం పడుతొంది. అయితే ఎలాంటి రద్దీ.. గట్రా లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుని ఎంచక్కా తిరుగుపయనం కావాలని అని భావించే భక్తులకు మాత్రం ఇది నిజంగా శుభవార్తే. వెంకన్న దర్శనం చేసుకుని వెనుదిరగాలని అనుకునే భక్తులకు ఇది అత్యంత సౌకర్యవంతమైన పయనం.

అదేంటీ అంటే. హైదరాబాద్ నుంచి తిరుమల వెంకన్న స్వామిని దర్శంచుకోవాలని తలిచే భక్తులకు ఐఆర్సీటీసీ ఒక బృహత్తర ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే రైలు ద్వారా తిరుమలకు ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇప్పుడు ఫ్లైట్‌లో భక్తులను తిరుపతికి తీసుకెళ్తోంది. 'తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. నవంబర్ 15, నవంబర్ 22, నవంబర్ 29, డిసెంబర్ 6, డిసెంబర్ 27 తేదీల్లో ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

భక్తులు ఐఆర్‌సీటీసీ టూరిజంకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేసి ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీ ప్రారంభ ధర ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.10970, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11780. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి ఏసీ హోటల్‌లో అకామడేషన్, 1 బ్రేక్‌ఫాస్ట్, 2 లంచ్, 1 డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఇక రైలు ప్రయాణంలో శ్రీవారి దర్శనం పొందాలంటే అందుకు మరో ప్యాకేజీ కూడా అందుబాటులో వుంది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలో బాగంగా భక్తులు సాయంత్రం 6 గంటలకల్లా రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి థర్డ్ ఏసీలో భక్తుల తిరుమల ప్రయాణం ప్రారంభమవుతొంది. మరుసటి రోజు ఉదయం ఆరు గంటల సమయానికి భక్తులు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారిని హోటల్ కు తీసుకెళ్లి.. అక్కడ మూడు గంటల సమాయాన్ని వారు ప్రెష్ అయ్యేందుకు ఇస్తుంది. ఉదయం 9.30 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి తిరుమలకు చేరుకుంటుంది. ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని భక్తులు మధ్యాహ్నం 1.30 గంటలకల్లా బస్సులోకి చేరుకోవాలి. ఇక కొండ దిగిన వెంటనే భోజనం చేసుకున్నా.. సాయంత్రం రైల్వేస్టేషన్ వద్ద నారాయణాద్రి ద్వారా తిరుగుప్రయాణం కల్పిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles