Pawan kalyan attacks YCP even in Delhi tour ఢిల్లీ వాళ్లకు కూడా సీఎం జగన్ గురించి అర్థమైందా.?

Pawan kalyan attacks ycp even in delhi tour with cartoons

Pawan Kalyan, JanaSena, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, English dailies cartoons, Sand crisis, English medium, reverse tendering, Andhra Pradesh, Politics

Jana Sena Chief Pawan Kalyan has hit out at the ruling YSRCP government even while is in Delhi tour. Even busy with his shedule in national capital the Jana Sena Chief targets CM YS Jagan Mohan Reddy with the English daily cartoons.

పవన్.. హస్తిన పర్యటన.. వైసీపీపై ఆంగ్ల కార్టూన్లతో దాడి.!

Posted: 11/16/2019 04:09 PM IST
Pawan kalyan attacks ycp even in delhi tour with cartoons

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీ నేతలపై మరోమారు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశ రాజధాని హస్తిన పర్యటనలో వున్న ఆయన తన బిజీ షెడ్యూల్ నేపథ్యంలోనూ అధికార వైసీపీపై విమర్శలకు ఏమాత్రం అవకాశం దొరికినా వదలకుండా టార్గెట్ చేస్తూనే వున్నారు. తాజాగా ఢిల్లీ నుండి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో 151 సీట్లతో వైసీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందించి ఐదు నెలలు గడిచినా.. ప్రభుత్వం మాత్రం భవన నిర్మాణ కార్మికుల ప్రధాన సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

ఐదు నెలలుగా 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి ప్రభుత్వం ఏదైనా వుందా అంటే అది వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. భవన నిర్మాణ రంగానికి చెందిన 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత కూడా అధికార వైసీపీకే దక్కుతుందని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. తమ వల్ల ఇబ్బందులకు గురవుతున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడం చేతకాని నాయకులు.. ఎంతసేపూ ప్రతిపక్షంలో వున్న పార్టీలపై విమర్శలు చేయడం.. వారిపై అసత్యాలను నిజాలుగా వక్రీకరించి.. ప్రజల దృష్టిని మళ్లించడం మాత్రం చేస్తున్నారని ఫైరయ్యారు.

అంతటితో ఆగని జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా తనదైన శైలిలో వైసీపీ పార్టీపై ఆంగ్ల దినపత్రికల కార్టూన్లతో దాడి చేశారు. ఢిల్లీలో జగన్ గురంచి ఇలా అనుకుంటున్నారంటూ ఓ కార్టూన్ ను షేర్ చేశారు. ఇందులో రెండు కాళ్లకు ఇసుక బస్తాలను కట్టుకుని... అతి కష్టంగా జగన్ ముందుకు నడుస్తున్నట్టు ఉంది. అంటే ఏపీలో వున్న ఇసుక సమస్య ఎంతటి ప్రాధాన్యం సాధించిందో ఈ కార్టూన్ స్పష్టం చేస్తుందన్నట్లు జనసేనాని దీనిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ఎవరెవరిని కలవబోతున్నారు? వైసీపీపై కేంద్రానికి ఏం ఫిర్యాదు చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  YS Jagan Mohan Reddy  AP CM YS Jagan  Sand crisis  Andhra Pradesh  Politics  

Other Articles