vijayashanthi urges CM KCR to privatize even finance ministry ఆర్థికశాఖనూ ప్రైవేటు పరం చేస్తారా.? సీఎంకు విజయశాంతి ప్రశ్న

Vijayashanthi urges cm kcr to privatize even finance ministry

vijaya shanthi, congress, TRS, Chief Minister, CM KCR, Kalvakuntla chandrashekar rao, KCR, TSRTC, Finance Ministry, Harish Rao, TSRTC strike, Ashwathama reddy, TSRTC JAC President, Telangana, Politics

Congress senior leader and publicity cell Incharge Vijayashanthi said the statement of Chief Minister KCR to privatize the TSRTC was nothing but an indication that he Kept the entire State on sale. If he really interested why don't he privatize the state finance ministry.

అర్టీసీనే కాదు.. ఆర్థికశాఖనూ ప్రైవేటు పరం చేస్తారా.? సీఎంకు విజయశాంతి ప్రశ్న

Posted: 11/04/2019 01:32 PM IST
Vijayashanthi urges cm kcr to privatize even finance ministry

ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని.. ఈ క్రమంలోనే ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అరోపించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఆర్టీసీ సంస్థ నష్టాల్లో నడుస్తుంటే.. కార్మికులకు అల్టిమేటం జారీ చేసిన గడువు విధించడం ఎందుకని అమె ప్రశ్నించారు. దీనిని బట్టి రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ నష్టాల్లో వుందా.? లేక నష్టాల్లో వున్నట్లు చూపుతున్నారా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని విజయశాంతి ప్రశ్నించారు.

ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం తప్పదని పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలోని ఒక సంస్థకు నష్టాలను అపాదించిన కారణంగా అప్పుట ఊబిలో వున్న కారణంగా ప్రైవేటుపరం చేస్తానని అంటున్నారని, అయితే ఇదే సూత్రం ఆయనకు ఎందుకు వర్తించదని ఆమె నిలదీశారు. మిగులు నిధులతో కళకళలాడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని తరాతరాల వరకు అప్పుల ఊబిలో కూరుపోయేట్టు చేసిన కేసీఆర్ సర్కార్ కూడా రాష్ట్రం నుంచి కనుమరుగు చేసే సమయం అసన్నమైందని అమె అన్నారు. నష్టాల్లో ఉన్నందుకు ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేటట్టు అయితే, ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆర్థిక శాఖను కూడా ప్రైవేటు పరం చేయాలని సూచించారు.  

 మీకు వర్తించని ఆర్థిక సూత్రాలు ఆర్టీసీకి మాత్రమే వర్తించాలని అనుకోవడం దొరల నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసేసుకున్నారని, తన కుట్రను కప్పిపుచ్చుకునేందుకు కొత్త నాటకం మొదలుపెట్టారని విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్న ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందన్న విజయశాంతి.. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలందరూ ఇదే మాట అంటున్నారని విజయశాంతి మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijaya shanthi  congress  TRS  CM KCR  TSRTC  Finance Ministry  Ashwathama reddy  Telangana  Politics  

Other Articles