Statewide emergency declared in Northern California కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. ఎమర్జెన్సీ విధింపు..

California governor declares statewide emergency as kincade fire grows to 50 000 acres

vegetation fires broke out, Emergency, Firefighters, Kincade Fire, Healdsburg, California, Los Angeles,

California Gov. Gavin Newsom declared a statewide emergency on Sunday as wind-whipped wildfires in the north and south of the state gobbled up land, destroyed homes and forced almost 200,000 people to flee.

కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. ఎమర్జెన్సీ విధింపు..

Posted: 10/28/2019 01:09 PM IST
California governor declares statewide emergency as kincade fire grows to 50 000 acres

అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాను కార్చిచ్చు చుట్టిముట్టింది. ఉత్తర కాలిపోర్నియా సహా దక్షిణ కాలిఫోర్నియాతో పాటు లాస్ యాంజిల్స్ లోని పలు ప్రాంతాలకు ఈ కార్చిచ్చు విసర్తించింది. కాలిఫోర్నియాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన కార్చిచ్చును చల్లార్చేందుకు  అధికారులు అన్ని ప్రయాత్నాలు చేస్తున్నారు. అయితే కార్చిచ్చుకు తోడు ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో నష్టం భారీగా వుందని అధికారులు తెలిపారు.

కాలిఫోర్నియాలోని అనేక నివాసాలతో సహా పలు కట్టడాలు మంటల్లో కాలిపోయాయి. విపరీతమైన వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తున్నాయి. విపరీతమైన వేడిగాలులకు అగ్గి రాజుకొని వృక్ష సంపదనంతా కబలించేస్తుంది. దీంతో అప్పమత్తమైన అధికారులు ఏకంగా లాస్ ఏంజీల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు పది లక్షల మందికి పైగా నివాసాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఆదివారం ఓవర్ నైట్ లో 30వేల ఎకరాల వృక్ష సంపద అగ్నికీలల్లో చిక్కుకున్నదని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు మంటలార్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాలిఫోర్నియా గవర్నర్ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. 1లక్షా 80వేల మందిని ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు గవర్నర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles