reporter brutally murdered in andhra pradesh తూర్పు గోదావరిలో పాత్రికేయుడి దారుణ హత్య..

Andhrajyothy reporter brutally murdered close to residence

reporter murdered in thondangi, journalist murdered in andhra pradesh, scribe murdered in Tuni, andhra jyothy reporter murderd in east godavari, kaatha satyanarayana, andhrajyothy reporter, thondangi, journalist murdered, andhra pradesh, crime

A local scribe was found murdered in East Godavari district of Andhra Pradesh, K Satyanarayana (45) working for andhra jyothy daily in Thondangi Mandal, was found murdered a few yards away from his house.

సత్యం వధ: తూర్పు గోదావరిలో ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య..

Posted: 10/15/2019 09:21 PM IST
Andhrajyothy reporter brutally murdered close to residence

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో అక్షరాన్ని హత్య చేశారు. ఓ విలేకరి కుటుంబంలో పెను విషాదాన్ని నింపి రుధిర అక్షరాలను లిఖించారు. న్యాయాన్ని నిబద్దతతో  వెలుగులోకి తీసుకువచ్చే సత్యాన్ని వధించారు. అక్రమాలపై సింహస్వప్నంలా ప్రశ్నించే గొంతును శాశ్వతంగా మూగబోయేలా చేశారు. హింసపై అహింసా మార్గంలో అక్ష్రరాయుధంతో యుద్దం ప్రకటించిన పాత్రికేయుడ్ని కాపుకాసి కత్తులతో కడతేర్చారు. ప్రజల పక్షాన నిలిచే విలేఖరి హత్యతో తుని ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

తూగ జిల్లాలో పత్రికా విలేకరి దారుణంగా హత్యకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణ (45)ను దుండగులు కిరాతకంగా నరికి చంపారు. ఎస్.అన్నవరం గ్రామ సమీపంలోని లక్ష్మీదేవి చెరువు గట్టుపై విలేకరిని అడ్డగించిన దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సత్యనారాయణ మృతి వార్తతో కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విలేకరి హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

ఆంధ్రజ్యోతి విలేఖరి సత్యనారాయణ హత్య ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీతో డీజీపీ సవాంగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్పీని డీజీపీ ఆదేశించారు. జర్నలిస్ట్ హత్య చాలా దారుణమైన ఘటన అని డీజీపీ ఖండించారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles