Tirumala Srivaru on Maha Ratham తిరుమల బ్రహ్మోత్సవాలు: మహారథంపై శ్రీవారు

Tirumala bramhostavam srivari rathostavam

tirumala,tirumala brahmotsavam, maha Ratham, srivari Rathostavam, Hanumantha vahanam, garuda vahanam, chinna shesha vahanam, hamsa vahanam. tirumala tirupati devasthanams, tirumala srivari brahmotsavam 2019, srivari brahmotsavam 2019, tirumala srivari brahmotsavam, brahmotsavam, srivari brahmotsavam, tirumala brahmotsavam 2019

Tirumala Sri vari Brahmotsavam celebrations are being conduted on the eighth day, as a part of brahmotsavam srivaru paraded Maha Ratham in the tirumada streets.

తిరుమల బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా శ్రీవారి రథోత్సవం

Posted: 10/07/2019 10:59 AM IST
Tirumala bramhostavam srivari rathostavam

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకునిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిట కొంగుబంగారమైన.. అల శ్రీనివాసుడికి ఇల వైకుంఠమైన  తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమందు అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల కన్నుల పండువగా సాగుతున్నాయి. ఎనవిదవ రోజును పురస్కరించుకుని దేవదేవుని ఇవాళ ఉదయం అంగరంగవైభవంగ రథోత్సవం నిర్వహించారు ఆలయ అధికారులు.

ఆలయ అర్చకులు రధంపై శ్రీవారికి సేవలో నిమగ్నం కాగా, మహారథం తిరుమాడ వీధుల్లో ఊరేగింది. కన్నుల పండువగా సాగిన ఈ ఉత్సవాన్ని తిలకించేందుక వేలసంఖ్యలో భక్తమహాజనులు కూడా తిరుమాడవీధుల్లోకి తరలివచ్చి.. మహారథంపై ఆ దేవదేవుని వీక్ష్=ిస్తూ తన్మయత్వంలో పులకించిపోయారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద నామాలు జపించడంతో తిరుమాడ వీధుల్లో భగవాన్ నామస్మరణ ప్రతిధ్వనించింది.

శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి మహారథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగితూ.. తన రధోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన అశేష భక్తజన కోటికి అభయప్రధానం చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అకట్టుకున్నాయి. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధుల్లో భక్తులు కిక్కిరిసిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala brahmotsavam  Hanumantha vahanam  garuda vahanam  tirumada streets  devotees  TTD  

Other Articles