Honey trap: Role of journalists appear in sex scandal మధ్యప్రదేశ్ హనీట్రాప్ కేసులో పాత్రికేయుల పేర్లు.!

Mp honey trap case after babus ministers role of journalists appear in sex scandal

MP honey trap case, MP honey trap case name of journalists, journalists in MP honey trap case, ministers in MP honey trap case, MP MP honey trap case, Madhya PRadesh honey trap case, honey trap, sex scandal, netas, babus, government higher officials, Journalists, Madhya pradesh, crime

Names of several Bhopal-based journalists have emerged in the high-profile honey-trap and extortion racket of Madhya Pradesh. The journalists allegedly having a role in the case, include a resident editor of a Hindi newspaper, a cameraman of a news channel and an owner of a regional satellite TV channel.

హనీట్రాప్ కేసు: బీజేపి నేతలు.. ప్రభుత్వాధికారుల తరువాత పాత్రికేయులు..!

Posted: 09/27/2019 05:08 PM IST
Mp honey trap case after babus ministers role of journalists appear in sex scandal

మధ్యప్రదేశ్లో భారీ సెక్స్ స్కాండల్ బయటపడింది. ప్రభుత్వాధికారులతో పాటు రాజకీయ పార్టీల నేతలను, ఇంకా బడాబాబులు అందమైన అమ్మాయిల పేరుతో ఎర వేసి ముగ్గులోకి దించిన సెక్స్ స్కాండల్ లో వినిపించిన పేర్లలో తాజాగా తెరపైకి పాత్రికేయుల పాత్రకూడా వుందని తెలుస్తోంది. అమ్మాయిలను ఎరలో చిక్కని వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంచిన వారిలో పాత్రికేయులు కూడా వున్నారన్న వార్త సంచలనంగా మారింది.

దాదాపు 40 మంది కాల్ గర్ల్స్‌తో రాజకీయ నాయకులు, అధికారులకు వలపు వల వేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులకు వలపు వల వేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు గుర్తించి, వారివద్ద 92 హై క్వాలిటీ వీడియోలను, రెండు ల్యాప్‌టాప్‌లను, పలు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు మహిళల్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

ఈ భారీ హనీట్రాప్ తో పాటు బ్లాక్‌మెయిలింగ్ లో ప్రధాన నిందితురాలిగా అరోపణలు ఎదుర్కోంటున్న శ్వేత స్వప్నిల్ జైన్ అనే మహిళ ప్రస్తుతం పోలీసుల అదుపులో వుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అమెను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె.. బాలీవుడ్‌కు చెందిన బీ గ్రేడ్ నటీమణులతో పాటు, 40 మంది టాప్ క్లాస్ కాల్ గర్ల్స్‌తో ఒక ముఠాను ఏర్పాటు చేసింది. వారితో రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు వల వేసి, వారికి దగ్గరయ్యేలా చేసేది. సెక్స్ అంటూ వారిని లొంగదీసుకొని.. పడకగదికి రప్పించేది. తాను చెప్పిన గెస్ట్ హౌజ్ గానీ, ఫైవ్ స్టార్ హోటల్‌కు గానీ రావాలని వారికి చెప్పేది.

ఆమె చెప్పిన చోటుకు వెళ్లి, సదరు వ్యభిచారిణితో సెక్స్‌లో పాల్గొంటుండగానే.. ముందుగా ఏర్పాటు చేసిన మొబైల్ కెమెరా లేదా స్పై కెమెరాతో ఆ తతంగాన్ని వీడియో తీసి.. ఆ వీడియోలతో వారిని బ్లాక్‌మెయిల్ చేయించేది. అలా మొత్తం 92 హై క్వాలిటీ వీడియోలను హార్డ్ డిస్క్‌లలో భద్రపరిచిందామె. వాటితో రాజకీయ నాయకులను, అధికారులను బ్లాక్‌మెయిల్ చేయించి.. ఓ మాజీ సీఎం నుంచి విలాసవంతమైన బంగ్లాను కూడా దక్కించుకుంది. ప్రభుత్వ కాంట్రాక్టులను కూడా దక్కించుకుంది. దీనికి శ్వేత భర్త స్వప్నిల్ జైన్ కూడా సాయపడ్డట్లు పోలీసులు గుర్తించారు.

వీరి వలలో పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చిక్కుకున్నట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్ వేదికగా ఏళ్లుగా ఈ కుంభకోణం నడుస్తోందని, ఇందులో చిక్కుకున్న వారిలో 80 శాతం బీజేపీ నేతలు ఉన్నారని తెలిపారు. 20 శాతం కాంగ్రెస్ నేతలు ఉన్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ నేతలు ఉన్నా వారిని అరెస్టు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ హనీ ట్రాప్ స్కాండల్ లో ఆర్తి దయాల్ అనే మహిళ కూడా ఇలాగే కొనసాగిస్తుందన్న సమాచారంతో అమెను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

వీరిని లోతుగా విచారించడంతో పాటు వీరి చెరలో పడ్డ బాధితులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు.. ఈ కేసులో పాత్రికేయుల పాత్ర కూడా వుందని తెలిపారు. ఓ హింది దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా విదులు నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు ఓ న్యూస్ ఛానెల్  కు చెందని కెమెరామెన్.. ఓ ప్రాంతీయ శాటిలైట్ ఛానెల్ యజమాని పాత్ర కూడా వున్నట్లు కనుగొన్నారు. వీరు ప్రభుత్వ అధికారులకు, నేతలకు వలపు వల వేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి  సీడీలు, హార్డ్ డిస్క్‌ను సిట్ కు అప్పగించారు.


 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honey trap  sex scandal  netas  babus  government higher officials  Journalists  Madhya pradesh  crime  

Other Articles