Hika cyclone to sink telugu states తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Fast approaching hikaa cyclone may trigger heavy rainfalls in telugu states

Arabian sea, Hikaa cyclone, Telangana, Telangana weather, Telangana rains, Rains in Andhra Pradesh, upper air cyclonic circulation, moderate rainfall in Telangana, Krishna, Godavari, Karnataka, Maharashtra, Uttar pradesh, Madya Pradesh, depression, Rains in Telangana, Rain Forecast

The depression In is moving rapidly towards the westward of the Indian coast and towards the centre of the Arabian Sea has developed storm. IMD predicts heavy to very heavy rainfall very likely in Andhra Pradesh and Telangana.

హికా తుపాను ఎఫెక్ట్: ఏపీ, తెలంగాణలకు భారీ వర్ష సూచన..

Posted: 09/26/2019 10:05 AM IST
Fast approaching hikaa cyclone may trigger heavy rainfalls in telugu states

తెలుగు రాష్ట్రాలలో గత పక్షం రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తూ రాష్ట్ర ప్రజల జనజీనాన్ని స్థంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో అటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారిన విషయం తెలిసిందే. ఇక చెరువులు కూడా జలకళను సంతరించుకున్నాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రజలు వర్షాల నుంచి తమకు ఉపశమనం ఎప్పుడు లభిస్తుందా.? అని ఎదురుచూస్తున్నారు.

అ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు మరో పిడుగు లాంటి వార్త అందించింది భారత వాతావరణ కేంద్రం. తెలుగు రాష్ట్రాలపై ‘హికా’ తుపాను పంజా విసేందుకు దూసుకొస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని తెలిపింది.

అలాగే, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, విదర్భ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో అరేబియా తీరంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arabian sea  Telangana  moderate rainfall  Hikaa cyclone  Andhra pradesh  Rain Forecast  

Other Articles