Kalavathi in Huzurnagar by poll race from BJP హుజూర్ నగర్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..

Congress announces padmavathi name for huzurnagar bypolls

Huzurnagar by polls, Assembly polls, uttam padmavathi, congress, Kalavathi, BJP, saidi reddy, TRS, Telangana, Politics

With the notification of By-polls for Huzurnagar assembly constituency, all the main political parties announced their candidates. BJP announced Kalavathi, TRS announced saidireddy, while sitting congress puts Uttam padmavati in the race.

హుజూర్ నగర్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే.. త్రిముఖ పోటీ..

Posted: 09/24/2019 05:52 PM IST
Congress announces padmavathi name for huzurnagar bypolls

హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డిని ప్రకటించారు. పద్మావతి పేనును అధికారికంగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పద్మావతి గత ఎన్నికల్లో కోదాడ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ స్థానానికి పద్మావతి అభ్యర్థిత్వాని ప్రతిపాదనను రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు.

అయితే.. పార్టీ సీనియర్ నేతలు రేవంత్‌పై మండిపడ్డారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారి నిర్ణయాలు పరిగణించాల్సిన అవసరం లేదనీ.. హుజూర్ నగర్ విషయంలో పక్క జిల్లాల నేతల సలహాలు అంతకన్నా అవసరం లేదని పార్టీ ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ టికెట్ విషయంలో ఏ వర్గం ప్రతిపాదనకు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసింది.

తెలంగాణ అసెంబ్లీకి 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తరువాత ఏప్రిల్ నెలలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో సిట్టింగ్ సీటును కాంగ్రెస్ ఆయన సతీమణికే కేటాయిస్తూ ఇవాళ ప్రకటనను విడుదల చేసింది.

అధికార టీఆర్ఎస్ పార్టీ గతంలో పోటీ చేసిన అభ్యర్థినే బరిలోకి దింపింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి టీఆర్‌ఎస్ అధిష్టానం సైదిరెడ్డి పేరును ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ ఆయనకు ఇప్పటికే బీ-ఫారం కూడా అందజేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీ సుదీర్ఘంగా చర్చిస్తోంది. శ్రీకళారెడ్డి ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై మంగళవారం సమావేశమైన రాష్ట్ర కోర్ కమిటీ.. ఈ అంశంపై దాదాపు గంటన్నరకు పైగా చర్చించి కళావతిని పేరును ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Huzurnagar by polls  Assembly polls  uttam padmavathi  congress  Kalavathi  BJP  saidi reddy  TRS  Telangana  Politics  

Other Articles