అదృష్టం అంటూ రాసివుంటూ అకాశంపైనున్నా, పాతాళంలోనున్నా.. సరిగ్గా రావాల్సిన సమయానికి చేరుకుంటుందని పెద్దలు చెప్పిన మాట. అయితే ఈ అదృష్టం ఎవరెవ్వరికీ సొంతం కావాలని వుంటే వారందరికీ చేరుతుందన్నది కూడా పెద్దల మాట. సరిగ్గా అలానే జరిగింది ఈ ఆరుగురు మిత్రుల విషయంలో. రెక్కాడితే కాని డొక్కాడని ఆ ఆరుగురు చిరుద్యోగులు కలసి తమ అదృష్టాన్ని ఓనమ్ పండగ సందర్భంగా పరీక్షించుకున్నారు. అంతే వారిని అదృష్ట లక్ష్మీ వరింది.
ఓ జ్యువెలరీ షాపులో పని చేసే ఆరుగురు చిరు ఉద్యోగుల కలిసి తలా కొంత డబ్బును వేసుకుని పండగ వేళ ఓ లాటరీ టికెట్ కొన్నారు. అదృష్ట దేవత వరించడంతో.. రూ.12 కోట్ల బంపర్ ఆఫర్ వారిని వరించింది. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజీవన్, రాంజీమ్, రోనీ, వివేక్, సుబిన్, రతీష్ అనే ఆరుగురు ఓ జ్యువెలరీ షాపులో సేల్స్ విభాగంలో పని చేస్తుంటారు.
రెండు రోజుల క్రితం కేరళ ఓనమ్ బంపర్ లాటరీ కొన్నారు. అయితే అందరూ ఒకే మాటపై నిల్చుని ఊరికే లాటరీలకు డబ్బులు తగలేయడం మంచిది కాదని, అయితే పండుగ సందర్భంగా ఓ సారి చూద్దామని అనుకుని మరీ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అంతే రాత్రికి రాత్రే కుబేరులైనట్టు గురువారం మధ్యాహ్నం వెల్లడించిన లాటరీ ఫలితాల్లో లక్కీగా వారు కొన్న టికెట్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీంతో ఒక్కరోజులోనే వారు కోటీశ్వరులయ్యారు. ఇప్పుడు తమ పెట్టుబడితో అందరూ కలసి నగల వ్యాపారం ప్రారంభిస్తామని అంటున్నారు.
రూ.12 కోట్ల విలువైన లాటరీ జాక్ పాట్ తగలడంతో ఆరుగురు స్నేహితులు తెగ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడటమే కాకుండా సమాజం కోసం కూడా ఖర్చు చేస్తామంటున్నారు. లాటరీ ప్రైజ్ మనీ రూ.12 కోట్లు అయినప్పటికీ.. పన్నులు పోనూ వీరికి రూ.7.56 కోట్లు అందనున్నాయి. అంటే ఒక్కొక్కరికీ 1.26 కోట్లపైమాటే. కేరళ ఓనమ్ బంపర్ లాటరీకి భారీగా డిమాండ్ ఉంటుంది. తొలి ప్రైజ్ రూ.12 కోట్లు కాగా.. రెండో ప్రైజ్ రూ.50 లక్షలు, మూడో ప్రైజ్ రూ.10 లక్షలు. ఈసారి రెండో ప్రైజ్ పది మందికి దక్కింది.
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more