techie charged Rs 4,300 for 18km auto ride కొత్త వాహాన చట్టం ఎఫెక్ట్.. ఎద్దుల బండికి జరిమానా..

Motor vehicles act effect techie charged rs 4 300 for 18km auto ride

yerawada, techie takes auto ride, New to city, katraj to yerawada, auto rickshaw, Pune, Bengaluru, Crime, pune yerwada, pune katraj, katraj to yerwada, pune autorickshaw, maharashtra autorickshaw, katraj dehu road, auto fare pune, pune news, pune crime news, pune crime

After setting foot in the city for the first time, a techie took the most expensive autorickshaw ride of his life. He who had come from Bengaluru to take up a job here, forked out Rs 4,300 for an 18km trip from Katraj to Yerawada.

కొత్త వాహాన చట్టం ఎఫెక్ట్.. కస్టమర్ ను బాదిన అటోవాలా..

Posted: 09/20/2019 11:01 AM IST
Motor vehicles act effect techie charged rs 4 300 for 18km auto ride

మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం తద్వారా వాహనదారులపై భారీ జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు. కాగా అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్రాల నిర్ణయాలకే వదిలేయడం కూడా వాహనదారులకు కాసింత ఊరటను కల్పించింది. అయితే అదును దొరికితే చాలు అడ్డంగా భాదేస్తాం అని చాటి చెప్పడంలో ముందుండే వారు కూడా ఈ చట్టాన్ని అసరాగా చేసుకుని అమాయక ప్రజలను లూటీ చేస్తున్నారు. ఇంతకీ వారెవరు అంటారా..? అటోవాలాలు.

అదెలా అంటే.. తాజాగా మహారాష్ట్రలోని ఐటీ నగరమైన ఫూణెలో దిమ్మ తిరిగే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒక టెకీకి ఆటో డ్రైవర్ రూ.4300 ఛార్జ్ వేసి భారీ షాకిచ్చాడు. ఇదెలా జరిగిందన్న విషయంలోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తొలిసారి ఫూణె వచ్చాడు. కత్రజ్ ఏరియాలో దిగిన అతగాడు క్యాబ్ బుక్ చేసుకోవటానికి ట్రై చేసి.. తప్పని పరిస్థితుల్లో ఆటోలో వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. రోడ్డు మీద వెళుతున్న ఆటోని ఆపాడు. ఎరవాడ వెళ్లాలని అడిగితే ఓకే చెప్పాడు.

ఆటోలో తాను కాకుండా వేరే వారు ఉండటంతో.. ఎవరని అడిగితే.. ఆటో డ్రైవర్ తాగి ఉన్నాడని.. కొత్త రూల్ నేపథ్యంలో అతన్ని వెనుక ఉంచి తాను ఆటో నడుపుతున్నట్లు చెప్పాడు. సర్లే అని సదరు టెకీ సర్దుకొని ఆటో ఎక్కాడు. అటోలో ఏకంగా 18 కి.మీ. ప్రయాణం తర్వాత తన గమ్యాస్థానానికి చేరుకున్నాడు సదరు టెకీ. ఎంతంటే.. రూ.4300 అని ఆటోవాలా చెప్పటంతో.. తాను తప్పుగా విన్నాననుకొని మళ్లీ అడగటం.. మీరు విన్నది కరెక్టే రూ.4300 అంటూ దురుసుగా బదులివ్వటంతో అవాక్కు అయ్యాడు.

అంత మొత్తం ఎందుకవుతుందంటే.. సిటీలో పోలీసులు ట్రాఫిక్ రూల్స్ మార్చేశారని.. సిటీలోకి ఆటో రావాలంటేనే రూ.600 అవుతుందని.. తాము చెప్పినంత ఇవ్వాలంటూ దబాయింపుతో పాటు.. బెదిరింపులకు దిగారు. దీంతో.. వారు అడిగినంత ఇచ్చేసి బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. చివరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. సదరు ఆటోవాలాను తాము తప్పక పట్టుకుంటామని ఫూణె పోలీసులు భరోసా ఇచ్చారు. మరేమవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Auto driver  Challan  Motor Vehicles Act  Uttarakhand  Traffic Violations. Police  

Other Articles