YSRCP govt may not continue Amaravati as AP capital: GVL దోబుచులాట వద్దూ.. రాజధానిపై స్పష్టతనివ్వండీ: బీజేపి

Ysrcp govt may not continue amaravati as ap capital gvl narasimha rao

GVL Narasimha Rao on amaravati, GVL on amaravati, BJP spokesperson on amaravati, GVL Narasimha Rao on AP capital, GVL on AP capital, BJP spokesperson on AP capital, GVL demands justice to capital farmers, GVL demands justification to farmers, GVL Narasimha Rao, sujana choudary, kanna laxminarayana, amaravati, Andhra Pradesh, Politics

BJP Rajya Sabha member GVL Narasimha Rao stated that the YSRCP government may not continue Amaravati as the capital of Andhra Pradesh. However, the MP asked the Jagan government to give clarity on rendering justice to farmers, who gave their lands for the construction of the capital.

ITEMVIDEOS: దోబుచులాట వద్దూ.. రాజధానిపై స్పష్టతనివ్వండీ: బీజేపి

Posted: 08/28/2019 04:03 PM IST
Ysrcp govt may not continue amaravati as ap capital gvl narasimha rao

అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా లేదని బీజేపి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్ర రాజధానిపై ప్రభుత్వమే ప్రజలను అందోళనకు, అయోమయానికి గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంలోని కొందరు మంత్రులు రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగదని.. ఇందుకు ఈ ప్రాంతంలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ కారణమని ప్రకటిస్తున్నారని.. అదే సమయంలో మరికోందరు మంత్రులు, నేతలు రాజధాని ఇక్కడే వుంటుందని ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని ఆయన విమర్శించారు.

ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా ఏపీ రాజధాని అమరావతి ప్రభుత్వ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పక్షాల్లు సైతం అయోమయంలోని నెట్టివేయబడ్డాయని, రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాజధాని తరలివెళ్తుందన్న వార్తే హాట్ టాపిక్ గా మారిందని జీవీఎల్ అన్నారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నది స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దోబుచులాటను మానుకుని రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలకు స్పష్టతను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీ మంత్రులు కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తుండడంతో అనిశ్చితి మరింత పెరుగుతోంది తప్ప, అది రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనకరం కాదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏపీ మంత్రులపై ఒత్తిళ్లు వస్తుండొచ్చేమోనని వ్యాఖ్యానించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను రాష్ట్రంలోని జగన్ సర్కార్ ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ది జరుగుతున్న క్రమంలో జరిగే అవినీతిని ఆధారాలతో ప్రభుత్వం సేకరించి.. వాటిపై చర్యలు తీసుకోవాలే తప్ప.. అరోపణలు వచ్చాయని రాజధానినే మార్చేస్తామంటే ఎలాగని జీవిఎల్ నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles