irctc to offer partial refund if train delays రైలు ఆలస్యమైతే క్యాష్‌బ్యాక్... ఐఆర్‌సీటీసీ ఆఫర్

Irctc to offer partial refund if private train tejas express delays by an hour

tejas express ahmedabad to mumbai, tejas express ahmedabad to mumbai timings, tejas express ahmedabad to mumbai fare, tejas express ahmedabad to mumbai news, tejas express ahmedabad to mumbai train number, IRCTC, Indian Railways, private train, tejas express, Delhi to Lucknow, mumbai to Ahmedabad, partial refund

IRCTC may compensate its passengers, in case the Mumbai-Ahmedabad Tejas Express service gets late by over an hour, once regular operations begin. The compensation can be in the form of credit to their e-wallets or concession for their future travels, according to IRCTC

రైలు గంట ఆలస్యంగా వస్తే క్యాష్ బ్యాక్... ఐఆర్‌సీటీసీ ఆఫర్..

Posted: 08/27/2019 03:59 PM IST
Irctc to offer partial refund if private train tejas express delays by an hour

భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలును ఐఆర్‌సీటీసీ నడపనుంది. ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య ప్రైవేట్ రైలు ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’ చక్కర్లు కొట్టనుంది. ఈ ప్రైవేట్ రైలులో పలు ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి ప్రైవేట్ రైలు అందుబాటులోకి రానుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభించబోతున్నాయి. విమానంలో అడిగిన వెంటనే సౌకర్యాలను అందించే ఎయిర్ హాస్టెస్ లు వున్నట్లుగానే రైల్ హాస్టెస్ లు కూడా ఇక ప్రైవేటు రైళ్లలో కనిపించనున్నారు. ఇక ఈ రైళ్లలో ప్రయాణమంటే ఎగిరిగంతేయాల్సిందే.!

ఇండియన్ రైల్వేస్ నడిపించే రైళ్ల విషయంలో ప్రయాణికులు ఎక్కువగా ఫిర్యాదు చేసేది సమయపాలన గురించే. రైళ్లు ఎప్పుడూ సమయానికి స్టేషన్లకు రావన్న పిర్యాదుతు ఎప్పుడూ ఉండేవే. అయితే దీనిని ప్రైవేట్ రైళ్లు అధిగమించనున్నాయి. అలా అన్ని ఏర్పాటు కూడా చేసుకోనున్నాయి. ఈ రైళ్లు సమయానికే గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించనుంది ఐఆర్‌సీటీసీ. రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల ఇ-వ్యాలెట్ లో కొంతడబ్బు జమ చేయాలని లేదా భవిష్యత్తులో బుక్ చేసే టికెట్లపై తగ్గింపు ఆఫర్ చేయాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది.

మొదట ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ నడిపించనుంది ఐఆర్‌సీటీసీ. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పుచేర్పులు చేసి ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టీ, కాఫీ వెండింగ్ మెషీన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇక ఎయిర్‌లైన్స్ తరహాలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టాయిలెట్లను తీర్చిదిద్దబోతోంది. ప్రతీ కోచ్‌లో అత్యాధునిక సౌకర్యాలతో రెండు టాయిలెట్స్ ఉంటాయి. ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కే నాటికి సౌకర్యాలు, సదుపాయాల గురించి స్పష్టత రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles