Delhi airport receives hoax bomb threat call ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..

Delhi airport operations affected for 70 minutes after hoax bomb

Delhi airport, hoax bomb call, bomb threat, Delhi, bomb, Inependence day, delhi police, High alert in delhi, tight security in delhi, Kashmir Live Updates, Article 35a, Article 370, Narendra Modi, Indian Prime Minister, PM Modi, Imran Khan, India-Pakistan Tension, Jammu And Kashmir, Kashmir Tensions

The terminal 2 of Delhi's Indira Gandhi International airport received a hoax bomb call on Monday. The operations were affected from 8.50 pm to 10 pm, according to airport officials.

ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. 70 నిమిషాలు అగిన సేవలు

Posted: 08/13/2019 10:53 AM IST
Delhi airport operations affected for 70 minutes after hoax bomb

స్వాతంత్ర్య దినోత్సవానికి సరిగ్గా మూడు రోజుల ముందు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపింది. విమానాశ్రయంలోని టెర్మినల్2లో బాంబు పెట్టినట్టు అగంతకులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో విమానాశ్రయంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనింది. ప్రయాణికులు అందోళనకు గురయ్యారు. హుటాహుటిన రంగంలోకి దిగిన భద్రతాధికారులు విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో వున్న ప్రయాణికులను ఖాళీ చేయించి సేవలను నిలిపివేశారు.

టెర్మినల్ 2లోని ప్రయాణికులను గేట్ నంబరు 4కు తరలించారు. విమానంలో వచ్చిన ప్రయాణికులను కిందికి దిగకుండా లోపలే ఉంచేశారు. ఆ వెనువెంటనే బాంబ్ స్వాడ్ దళానికి చెందిన సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సోమవారం రాత్రి సరిగ్గా 8.50 నిమిషాలకు ఈ కాల్ రావడంతో రంగంలోకి దిగిన అధికారులు విమానాశ్రయంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏకంగా గంటా పది నిమిషాల పాటు సేవలను నిలిపివేశారు.

ఇక 70 నిమిషాలకు పైగా తనీఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ బాంబు లేదని నిర్థారించుకున్న తరువాత విమానాశ్రయానికి వచ్చిన అగంతకుని ఫోన్ కాల్ కేవలం ఫేక్ కాల్ అని తేల్చారు. దీంతో విమానాశ్రయం అధికారులు, సిబ్బంది, భద్రతాధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi airport  hoax bomb call  bomb threat  Inependence day  jammu and kashmir  

Other Articles