BJP stalwart behind formation of Telangana చిరుమందహాస చిన్నమ్మ.. తెలంగాణ నిన్ను మరవదమ్మా..!

Sushma swaraj the bjp stalwart behind formation of telangana

sushma swaraj, Sushma Swaraj, death, State honours, Telangana, Kishan Reddy, KCR, YS Jagan, Andhra Pradesh, sushma swaraj delhi cm,sushma swaraj husband,sushma swaraj latest news,sushma swaraj family,sushma swaraj holiday,swaraj Kaushal,sushma swaraj dead,age of sushma Swaraj,sushma swaraj daughter,sushma swaraj passed away

Several leaders from all over the world mourned the death of former external affairs minister Sushma Swaraj including the people of telangana as she was the stalwart from BJP who stood beyound the formation of telangana.

ITEMVIDEOS: చిరుమందహాస చిన్నమ్మ.. తెలంగాణ నిన్ను మరవదమ్మా..!

Posted: 08/07/2019 02:46 PM IST
Sushma swaraj the bjp stalwart behind formation of telangana

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి, తెలంగాణవాసుల చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌ తీవ్ర గుండెపోటుతో పరమపదించడంతో. తెలంగాణలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను నమ్మి, నడిచిన పార్టీ సిద్దాంతాలను తూచా తప్పకుండా పాటిస్తూ.. యుక్తవయస్సులో పార్టలో చేరి.. రమారమి ప్రధాని పదవిని అందుకునే రేసు వరకు ఎదిగి దేశ రాజకీయాలలోనే తనదైన ముద్రవేసుకుని.. పార్టీలకు అతీతంగా అందరితో సఖ్యతతో మెలిగారామె.

తన అనర్గల ప్రసంగాలతో, సంప్రదాయమైన కట్టుబొట్టుతో భారత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారామె. ఇందిర తర్వాత విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనతకెక్కిన చిన్నమ్మ.. ఆ పదవికే వన్నె తేవడంతో పాటు పదవిలో కొనసాగినంత కాలం తన సత్తాను చాటుకున్నారు. అంతేకాదు తాను అనతికాలంలో చేసిన మేలును పోందిన దాయాధి దేశస్థులు కూడా తమకు అమె లాంటి ప్రధాని కావాలని, అమె తమ ప్రధాని అయితే మరింత బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారంటే. అమె సమర్థత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.  

ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించారు అమె. బీజేపిలోని పలువురు నేతలు కాకినాడ తీర్మాణంలో ఓ మాట, రాష్ట్ర పునర్విభజన సమయంలో మరోమాట.. ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇంకోమాట మార్చారు. కానీ తాను చెప్పిన మాటకు కట్టుబడి తెలంగాణవాసులు చిరకాల వాంఛను సఫలీకృతం చేయడంలో.. ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకరం చేయడంతో అమె తన సహకారాన్ని అందించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంటులో అన్ని పక్షాలను కలుపుకునే ప్రయత్నం చేయండీ.. అధికార పక్షంతో పాటు ప్రథాన ప్రతిపక్షంగా వున్న తాము తమ మిత్రపక్ష పార్టీలతో కలసి బిల్లు అమోదం పోందేందుకు అన్నివిధాలా సహకరిస్తామని ఆమె నినదించారు. అంతేకాదు తెలంగాణ కోసం పిట్టల్లా రాలిపోతున్న యువతను చూసి.. చెలించిపోయిన అమె.. చట్టసభలో తెలంగాణ వాసులారా.. మీరు ప్రాణలు బలిఇవ్వకండీ.. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని చూడటానికైనా బతికుండాలని అమె నిండుకోలువులో విన్నవించారు.

తెలంగాణ ప్రజలతో సుష్మాస్వరాజ్ కు ప్రత్యేకంగా అనుబంధం ఉంది. దీనితో తెలంగాణ ప్రజలందరూ సుష్మాస్వరాజ్ అంటే ప్రత్యేకంగా ఆదరాభిమానాలు వ్యక్తంచేసేవారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ చిన్నమ్మగా ఆమె పేరుగాంచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత.. వందల మంది వలస కార్మికులు, ఉపాధికోసం వెళ్ళినవారు గల్ఫ్ తదితర దేశాల్లో అనేక కష్టనష్టాల బారిన పడగా వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందకు విధేశీ వ్యవహారాల మంత్రి హోదాలో అమె సహకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  death  State honours  Telangana  Kishan Reddy  KCR  YS Jagan  Andhra Pradesh  

Other Articles