JanaSena chief Pawan Kalyan to visit West Godavari పశ్చిమ గోదావరి పర్యటనకు జనసేనాని పవన్ కల్యాణ్..

Janasena chief pawan kalyan to visit west godavari

Pawan Kalyan, Janasena, west godavari, key leaders meeting, Murali krishna, cancer, family members, YSRCP, CM Jagan, Chandrababu, Nara Lokesh, TDP. BJP, Andhra Pradesh, Politics

JanaSena chief Pawan Kalyan to visit West Godavari and conduct meetings with key leaders and supporters of the district, The power star will also meet the family of murali krishna the party worker who recently expired suffering with cancer.

పశ్చిమ గోదావరి పర్యటనకు జనసేనాని పవన్ కల్యాణ్..

Posted: 08/03/2019 10:13 AM IST
Janasena chief pawan kalyan to visit west godavari

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ పరాజయానికి కారణాలను లోతుగా అధ్యయనం చేసుకుంటూ వరుస సమావేశాలలో బిజీగా మారిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఇక క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలతోనూ ఓటమిపై విశ్లేషించుకునేలా కార్యచరణ రూపొందించుకున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వస్తున్నాయి, ఇందులో భాగంగా ఆయన తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ నెల 4, 5 తేధీలలో ఈమేరకు ఆయన పశ్చిమ గోదావరిలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైందని కూడా పేర్కోన్నాయి. ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులతో కలసి ఆయన రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధాంతం, పెనుగొండ మీదుగా భీమవరం వెళతారు. అదే రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జనసేనాని సమావేశం కానున్నారు.

ఆ మరుసటి రోజు నరసాపురం పార్లమెంటరీ స్థానంలో పర్యటించనున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొని పార్టీ పరాజయానికి గల కారణాలను విశ్లేషణ చేసుకుంటారు. దీంతో పాటు పార్టీ ఆరంభం నుంచి ఇదే నియోజకవర్గం పరిధిలో కీలకంగా వ్యవహరించిన కార్యకర్త మురళీకృష్ణ అకస్మిక మృతి పట్ల అప్పట్లో సానుభూతి వ్యక్తం చేసిన పవన్.. ఈ పర్యటనలో ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మురళీకృష్ణ ఇటీవల కేన్సర్ వ్యాధితో మరణించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  west godavari  Murali krishna  cancer  family members  Andhra Pradesh  Politics  

Other Articles