Court issues arrest warrant on tollywood producer ‘జబర్థస్త్’ కష్టాల్లో బెల్లకొండ.. అరెస్టుకు రంగం సిద్దం..

Court issues arrest warrant on tollywood producer bellamkonda suresh

bellamkonda suresh, tollywood producer, jabardasth, TV channel, delhi high court, samantha, siddarth, movies, entertainment, tollywood,

Tollywood popular producer bellamkonda suresh is in dolldrums, An Tv channel had approched court against him in delay of paying the amount, After hearing the petition the apex court had issued arrest warrant against the producer.

‘జబర్థస్త్’ కష్టాల్లో బెల్లకొండ.. అరెస్టుకు రంగం సిద్దం..

Posted: 08/01/2019 10:31 AM IST
Court issues arrest warrant on tollywood producer bellamkonda suresh

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. హైకోర్టు అదేశాలతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు కార్యోన్ముఖులయ్యారు. తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వడంలో మీనమేషాలు లెక్కపెడుతూ.. ఏళ్ల పాటు పదే పదే తిప్పించుకున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ విఫలమయ్యారని ఓ ప్రముఖ టీవీ చానల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన క్రమంలో న్యాయస్థానం ఆయనపై అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, దాదాపు ఆరేళ్ల క్రితం హిందీలో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ 'బాండ్ బాజా బరాత్' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది హిందీలో సూపర్ హిట్ అయింది. అదే సమయంలో బెల్లంకొండ సురేష్, సమంత, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా 'జబర్దస్త్' అనే సినిమాను నిర్మించారు. తమ సినిమాలోని 19 సీన్లను 'జబర్దస్త్'లో కాపీ చేశారని ఆరోపిస్తూ, అప్పట్లోనే యశ్ రాజ్ ఫిలింస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన కోర్టు సినిమా ప్రదర్శనను నిలిపివేసింది.

కాగా, ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే శాటిలైట్ హక్కులను రూ. 3.50 కోట్లకు బెల్లంకొండ అమ్మేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ హైకోర్టు, చిత్రాన్ని టీవీల్లో సైతం ప్రదర్శించరాదని ఆదేశించింది. ఆపై సదరు టీవీ చానల్ తాము చెల్లించిన రూ. 3.50 కోట్లను తిరిగి చెల్లించాలని బెల్లంకొండ సురేష్ చుట్టూ ఆరేళ్లుగా తిరుగుతున్నా, ఇవాళ, రేపు అంటూ ఆయన తిప్పించుకున్నారు. దీంతో సదరు చానెల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా, అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అప్పట్లో చానెల్ ఇచ్చిన రూ. 3.50 కోట్ల మొత్తం ఇప్పుడు వడ్డీలతో కలిపి రూ. 11.75 కోట్లకు చేరడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bellamkonda suresh  tollywood producer  jabardasth  TV channel  delhi high court  tollywood  

Other Articles