pawan kalyan sensational comments on liquor ban in AP మద్యం నిషేధంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan kalyan sensational comments on liquor ban in andhra pradesh

YSRCP, CM Jagan, Pawan Kalyan, Janasena, Chandrababu, Nara Lokesh, BJP, Andhra Pradesh, Politics

JanaSena chief Pawan Kalyan made sensational comments on liquor ban in Andhra pradesh, the power star said it is highly impossible to ban liquor in the state and states even CM YS Jagan too known the same.

ITEMVIDEOS: మద్యం నిషేధంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted: 07/31/2019 05:42 PM IST
Pawan kalyan sensational comments on liquor ban in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మద్యపాన నిషేధం అమలుచేస్తామని సీఎం జగన్ అంటున్నారనీ.. అది జరగదనే విషయం జగన్ కు ముందుగానే తెలుసని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తామని చెబుతున్నారని.. అయితే ఈ అంచెలంచెలు ఎప్పటి పూర్తవుతాయని ప్రశ్నించారు. చేస్తామనే మాటలే తప్ప.. మద్యపాన నిషేధం అనేది.. జరిగే ప్రసక్తే లేదనీ జనసేనాని తేల్చిచెప్పారు.

అమెరికాలోనే మద్యపాన నిషేధం సాధ్యం కాలేదని.. అలా చేస్తేనే మాఫియా పుట్టుకొచ్చిందంటూ వెల్లడించారు. తమకు ఈ విషయం తెలిసే ఎన్నికల మేనిఫెస్టోలో బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీ తీసుకొస్తామని చెప్పినట్లు వెల్లడించారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి వ్యతిరేకం అని చెప్పకనే చెప్పిన పవన్.. కంట్రోల్ చేయటానికి లిక్కర్ పాలసీకి మాత్రం ఓకే అన్నారు. ఇక నాయకులు ప్రజల మధ్య ఉండాలని, ప్రతిరోజూ ప్రజలను కలిసేందుకు తిరగాలని పవన్ కల్యాణ్ సూచించారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజమండ్రికి చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రధాని మోదీ సంవత్సరం అంతా తిరుగుతున్నారని చెప్పిన పవన్, చంద్రబాబు, లోకేశ్ లు తిరుగుతున్నారా? వీళ్లెవరూ తిరగరని విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై కేసులు కనుక లేకపోతే, ఆయన తిరిగే వారు కాదని, కూర్చునే రాజకీయం చేసేవారని అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  CM Jagan  Pawan Kalyan  Janasena  Chandrababu  Nara Lokesh  BJP  Andhra Pradesh  Politics  

Other Articles