CCD founder Siddhartha's body found from river నేత్రావతి నదిలో సిద్దార్థ్ మృతదేహం లభ్యం..

Cafe coffee day founder vg siddhartha s body found from river

SM Krishna son in law siddhartha, cafe coffee day founder siddhartha, siddhartha, SM Krishna, cafe coffee day, Founder, Ullal bridge, River Netravati, Karnataka, Crime

The body of Cafe Coffee Day founder V G Siddhartha has been found from the Nethravathi river, according to TV reports on Wednesday. Siddhartha's body was found on the banks of the river near the Hoige Bazaar in Mangaluru,

‘కేఫ్ కాఫీ డే’ ఫౌండర్ సిద్దార్థ్ విషాదాంతం.. నేత్రావతిలో మృతదేహం లభ్యం..

Posted: 07/31/2019 10:38 AM IST
Cafe coffee day founder vg siddhartha s body found from river

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యం విషాదాంతమైంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు తన సంస్థను లాభాలబాటలో పయనింపజేసేందుకు ఆయన తన మిత్రులు, ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న రుణాలే పెనుభారంగా తయారయ్యాయి. ఈ క్రమంతో రుణదాతల నుంచి ఒత్తడి తీవ్రవై ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఈ మేరకు కాఫీ డే సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కు రాసిన ఓ లేఖలో ఆయన పేర్కోన్నట్టు చెప్పబుతున్న విషయమే వాస్తవమని తెలుస్తోంది.

బెంగళూరు నుంచి సకలేష్ పూర్ కు వ్యాపార వ్యవహార నిమిత్తమై సోమవారం రాత్రి బయలుదేరిన ఆయన మంగళూరుకు చేరుకునే క్రమంలో అదృశ్యమయ్యారు. మంగళూరులోని ఉల్లాల్‌లో బ్రిడ్జిపై నుంచి ఆయన నేత్రవతి నదిలకి దూకేసి ఆత్మహత్యకు పాల్పడినట్టు వచ్చిన వార్తల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితంగా ఇవాళ ఉదయం నేత్రావతి బ్యాక్ వాటర్ లో ఆయన మృతదేహం లభ్యమైంది.

సిద్ధార్థ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మంగళూరులోని వెన్ లాక్ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక సిద్ధార్థ మృతదేహం లభ్యమయిందని తెలిసిన వెంటనే ఆయన బంధుమిత్రులు వెన్ లాక్ ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్నటివరకూ తమ మధ్య తిరిగిన వ్యక్తి, ఇప్పుడు లేడంటే నమ్మలేకున్నామని అంటున్నారు. మరోవైపు మంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఉన్న కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లు, ఔట్ లెట్ల ఉద్యోగులు సిద్ధార్థ్ కు నివాళులు అర్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SM Krishna  siddhartha  cafe coffee day  Founder  Ullal bridge  River Netravati  Karnataka  Crime  

Other Articles