KTR responds to Director Maruthi's tweet over water supply in hyderabad కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా!

Ktr responds to director maruthi s tweet over water supply in hyderabad

Hyderabad, Director Maruthi, KTR, Water Supply in Hyderabad

KTR responds to Director Maruthi's tweet over water supply in hyderabad

కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా!

Posted: 07/17/2019 03:36 PM IST
Ktr responds to director maruthi s tweet over water supply in hyderabad

ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.‘హైదరాబాద్‌కు 48 రోజులకు సరిపోయే మంచి నీరు మాత్రమే మిగిలి ఉంది’ అని ఓ ఆంగ్ల పత్రికలో వార్త ప్రచురితమైంది. అది మారుతి దృష్టికి రావడంతో దానిని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు. ‘సర్‌ ఇది నిజమేనా’ అని ప్రశ్నించారు. ఇందుకు కేటీఆర్‌ సమాధానమిస్తూ.. ‘ఆ వార్త కరెక్ట్‌ కాదు. మరికొన్ని వారాల్లో కాలేశ్వరం నీరు ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి వస్తుంది. దీని ద్వారా హైదరాబాద్‌కు రోజుకు 172 మిలియన్‌ గ్యాలన్ల నీరు అందుతూనే ఉంటుంది. ఇందులో ఏ మార్పూ లేదు. ఇందుకు మారుతి ప్రతి స్పందిస్తూ.. ‘శుభవార్త చెప్పినందుకు ధన్యవాదాలు సర్‌. నీటి ఎద్దడి సమస్యను సీరియస్‌గా తీసుకుని నీటిని సంరక్షించుకునే సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Director Maruthi  KTR  Water Supply in Hyderabad  

Other Articles