FIR against Amazon over products with Hindu god images భరితెగిస్తున్న అమెజాన్.. హిందూ దేవుళ్ల చిత్రాలతో..

Fir against amazon for selling products with hindu gods images

Amazon,Amazon fir,fir against Amazon,Amazon hindu god products,Amazon hindu god toilet cover,Amazon rugs,Amazon hindu god rugs.Amazon.com,Amazon news

Police in Uttar Pradesh Noida city on Friday registered a case against Amazon Inc. for allegedly hurting "Hindu sentiments" by selling rugs and toilet seat covers with pictures of Hindu gods on its US website.

భరితెగిస్తున్న అమెజాన్.. హిందూ దేవుళ్ల చిత్రాలతో..

Posted: 05/18/2019 08:40 PM IST
Fir against amazon for selling products with hindu gods images

ప్రముఖ ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అమెజాన్ తమ ప్లాట్ ఫాంపై దేవుళ్ల బొమ్మలతో ప్రొడక్టులు అమ్ముతోందంటూ ఫిర్యాదులు వచ్చాయి. నోయిడా పోలీసులు అమెజాన్ పై కేసు నమోదు చేశారు. అమెజాన్ యూఎస్ వెబ్ సైట్లో రగ్గులు, టాయిలెట్ సీటు కవర్లపై హిందూ దేవతల ఫొటో ఫ్రింట్ తో సేల్స్ చేస్తోంది. కొన్నిరోజులుగా ట్విట్టర్ లో కూడా అమెజాన్ పై ట్విట్టర్ యూజర్లు #BoycottAmazon అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రోల్స్ చేశారు.

ఈ క్రమంలో అమెజాన్ వివాదాస్పద ప్రొడక్టుల సేల్స్ పై ఐపీసీ 153ఎ సెక్షన్ కింద కేసు నమోదైంది. వికాస్ మిశ్రా అనే వ్యక్తి అమెజాన్ పై సెక్టార్ 58 పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అమెజాన్ యూఎస్ వెబ్ సైట్లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తరచుగా సెల్లింగ్ ప్రొడక్టులను అమ్ముతున్నారు. దీనివల్ల దేశంలో మతపరంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమెజాన్ శాంతిపరమైన వాతావరణం నెలకొనేలా చూడాలని మిశ్రా తన ఫిర్యాదులో తెలిపాడు.

మిశ్రా ఫిర్యాదు మేరకు సర్కిల్ ఆఫీసర్ నోయిడా సెకండ్, పియూష్ కుమార్ సింగ్.. ఈ కామర్స్ దిగ్గజంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అమెజాన్ ప్రతినిధి ఈ విషయంలో విక్రయదారులకు క్లారిటీ ఇచ్చారు. కంపెనీ సెల్లింగ్ గైడ్ లైన్స్ ను విక్రయదారులు అందరూ తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఎవరైతే నిబంధనలను అతిక్రమిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెజాన్ వెబ్ సైట్ స్టోర్ లో అలాంటి ప్రొడక్టులపై విచారించి తొలగిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles