Filipino Maid Tied to a Tree in Hot Sun రాక్షసానందం: ఠారెత్తిన ఎండలో మహిళను చెట్టుకు కట్టేసి..

Filipino maid tied to a tree as punishment in hot sun

Saudi arabia, Riyadh, Filipino house maid, house maid, punishment, tied to tree, Overseas Workers, torture, Indians, middle-east, crime

A Filipino maid was allegedly tied to a tree by her wealthy employers in Saudi Arabia on May 9 as punishment for leaving furniture out in the sun.

రాక్షసానందం: ఠారెత్తిన ఎండలో మహిళను చెట్టుకు కట్టేసి..

Posted: 05/16/2019 07:15 PM IST
Filipino maid tied to a tree as punishment in hot sun

సౌదీ అరేబియాకు వలస వెళ్లి అక్కడ ఏదో పనిచేసి తమ కుటుంబాలకు డబ్బు పంపి వారికి కడుపునిండా బోజనం పెట్టాలని అనేక మంది ఏడాది దేశాల బాట పడతారు. అయితే అక్కడి నరకం ఎలా వుంటుందో ఇటీవలే మనం చూశాం. ఒంటే చనిపోయిందని తనను గోడ్డకన్నా దారుణంగా చావబాదిన ఓ తెలంగాణ వాసి, రంజాన్ పండగకు తనకు ఉండబోదని మరో తెలంగాణ వాసి వారి దయనీయస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఎంతో ఆశతో అక్కడకు వెళ్లిన వారు తమ నరకయాతనను వెళ్లడించే వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

అయితే ఇలా మన దేశస్తులే కాకుండా అటు అసియా, మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన వారు కూడా ఇలానే ఏడారి దేశాలకు వలసవెళ్తుంటారు. సౌదీయులు తమ ఇళ్లలో పని చేయించుకునే వలస జీవుల పేదరికాన్ని అసరాగా చేసుకుని ముప్పతిప్పలు పెడుతూంటారు. ముందుగానే పాస్‌పోర్టు లాగేసుకోవడంతో పనికి చేరిన చాలా మంది తప్పక ఆ నరకయాతనలోనే జీవిస్తూ ఉంటారు. అయితే ఖరీదైన ఫర్నీచర్ ను ఎండలో వుంచిందన్న కారణంగా అమెకు కూడా ఆ భాధ తెలిసేలా చేయాలని.. యువతి అన్న కనీస కనికరం కూడా లేకుండా ఓ యజమాని పనిమనిషికి వేసిన శిక్షను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఏం చేశాడంటే ఖరీదైన ఫర్నీచర్ ను ఎండలో పెట్టినందుకు అమెను కూడా ఠారెత్తించే ఎండలో చెట్టుకు కట్టేశాడు. అమె కాళ్లు, చేతులు కూడా చెట్టుకు గట్టిగా కట్టేసి రోజంతా ఎండలో నిలబెట్టాడు. ఇలా అమెకు శిక్ష వేసిన యజమాని రాక్షసానందం పొందాడు. ఫిలిప్పీన్స్‌కు చెందిన లవ్‌లీ అకోస్టా(26) అనే పనిమనిషిని ఈ శిక్షను అనుభవించింది. మరో పనిమనిషి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మే 9న జరిగిన ఈ ఘటనపై సౌదీ విదేశాంగశాఖ స్పందించి పనిమనిషిని అక్కడి నుంచి విడిపించి తిరిగి ఫిలిప్పీన్స్‌కు వెళ్లేందుకు తోడ్పాటు అందించింది. తాము ఏ చిన్న తప్పు చేసినా.. కఠిన శిక్షలు విధిస్తున్నారంటూ ఆ యజమానిపై మరో పనిమనిషి ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles