dharna chowk row: congress suspends Nages from party నాగేశ్ కు షాక్.. కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్..

Dharna chowk row congress suspends nages from party

v hanumanth rao, nagesh, inter results, dharna chowk, all party agitation, Justice for Inter Students, telangana congress, latest telugu news, Telangana, politics

This is shock to congress leader Nagesh, the party displinary committe has suspended its Leader Nagesh from the congress party, after the quarell with party senior leader V Hanumantha rao, that went viral at Dharna chowk on saturday.

ధర్నాచౌక్ తోపులాట ఎఫెక్ట్: కాంగ్రెస్ నుంచి నాగేశ్ సస్పెన్షన్..

Posted: 05/13/2019 03:42 PM IST
Dharna chowk row congress suspends nages from party

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ అఖిలపక్ష పార్టీలు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతపై విరుచుకుపడిన టీపీసీసీ కార్యదర్శి నాగేష్ పై కాంగ్రెస్ పార్టీ వేటుపడింది. సీనియర్ నేత వీహెచ్ తో ఆయన అనుచితంగా వ్యవహరించారని భావించిన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న అఖిలపక్షం నేతృత్వంలో నిర్వహించిన సభలో మాటామాటా పెరిగి వి.హనుమంతరావు, నగేశ్ ల మధ్య కొట్లాటకు దారి తీసిన విషయం తెలిసిందే.

ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో అఖిలపక్షం ఆద్వర్యంలో చేపట్టిన ధర్నా సాక్షిగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ బోర్డు వైఖరికి నిరసనగా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంతాపంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణలోని అఖిలపక్షం ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టింది. అన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వేదికపై ముందు వరసలో కూర్చునేందుకు వస్తున్న పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాకు స్థానం కల్పించాలని నగేష్ ను అదేశించిన క్రమంలో అరేయ్ అని సంబోధించాడు వీహెచ్.

దీనిపై నాగేశ్ తన అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. అరేయ్ అని చులకనగా సంబోధించడంపై మండిపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ పై గజ్జెల నగేశ్ చేయిచేసుకున్నారు. ఆవేశంతో ఆయనపైకి వెళ్లారు. నెట్టేశారు. వీహెచ్ కింద పడిపోతుంటే వెనక ఉన్న నేతలు పట్టుకున్నారు. ఆ తర్వాత నగేశ్ పై చేయిచేసుకున్నారు వీహెచ్. వేదిక పైనుంచి నెట్టివేశారు. ఇద్దరూ తిట్టుకున్నారు. పార్టీ నేతలు అందరూ ఉన్న ఈ వేదికపై ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. దీనిపై పార్టీ క్రమశిక్షణ సంఘం ఇవాళ చర్యలు తీసుకుంది. కాగా, క్రమశిక్షణా సంఘం వీహెచ్ కు తొత్తుగా పనిచేస్తోందని నాగేశ్ అరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన ఏకంగా న్యాయస్థానాన్ని అశ్రయిస్తానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : v hanumanth rao  nagesh  congress  suspension  disciplinary commitee  dharna chowk row  politics  

Other Articles