Cyclone Fani intensifies, to move towards Odisha coast ఫణి ఎఫెక్ట్: ఒడిశాలో ఎన్నికల కోడ్ ఎత్తివేత..

Cyclone fani heads to odisha poll code lifted in 11 districts

IMD, Andhra cyclone alert, Odisha cyclone alert, cyclone alert odisha, IMD cyclone alert, Andhra pradesh fani storm, Andhra pradesh Weather, Andhra pradesh fani, Andhra pradesh storm, Andhra pradesh cyclone alert, Andhra pradesh fani alert, Odisha storm, puducherry storm, odisha weather, odisha fani storm alert, Cyclone Fani, Fani, Odisha, IMG, Puri

In view of cyclone storm Fani intensifying into a ‘Severe Cyclonic Storm’ over the south-east and adjoining south-west Bay of Bengal, high alert issued in Andhra pradesh and odisha.

ఫణి ఎఫెక్ట్: ఒడిశాలో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

Posted: 05/01/2019 03:04 PM IST
Cyclone fani heads to odisha poll code lifted in 11 districts

భయంకర ఫెను తుఫానుగా మారి ఒడిషా రాష్ట్రంలోని పూరి వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ కేంద్ర హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నియమావళిని ఎత్తివేశారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేశారు. ఫణి తుఫాన్ వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని.. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరిన నేపథ్యంలో దానిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఒడిశా రాష్ట్రంలోని మొత్తం 11 తీర ప్రాంత జిల్లాల్లో నియమావళిని ఎత్తివేశారు. జగత్సింగ్ పూర్, కేంద్రపర, భద్రక్‌, బాలాసోర్‌, మయూర్‌బంజ్‌, జైపూర్, గజపతి, గంజాం, ఖుర్ధా, కటక్‌, జైపూర్ జిల్లాలు ఉన్నాయి. ఎన్నికల్లో భాగంగా ఒడిశా 21 స్థానాల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. నాలుగో దశ కింద  ఏప్రిల్ 29వ తేదీన ఒడిశా రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయినా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలోనే ఫణి తుపాన్ వచ్చింది. గోపాల్ పూర్, చాంద్ బలి ప్రాంతాల మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ఇది చాలా తీవ్రమైన పెను తుఫాను కావటం.. సహాయ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉండటంతో కోడ్ ఎత్తివేస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

దక్షిణ పూరి ప్రాంతంలో మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో.. గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీకి ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ వెళ్లారు. అక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరాను కలిశారు. ఫణి తుఫాన్ ప్రభావంపై చర్చించారు. తీవ్ర ప్రమాద హెచ్చరికలుండడంతో ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని కోరారు. అలాగే మే 19కి వాయిదా పడిన పాట్‌కుర అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికను కూడా వాయిదా వేయాలని కోరారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై మాత్రం ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపిన ప్రభుత్వం ఎక్కడ ఏలాంటి ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదేశించింది. వీరికి తోడు నౌకాదళం, తీరప్రాంత రక్షణ దళం, విపత్తు నిర్వాహణ ఏర్పాట్లు చేస్తున్నాయి. మే 2 నుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. తీర ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు ఇది వర్తిస్తుందని..మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సెలవులుంటాయని తెలిపింది. పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు..మళ్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. మరోవైపు అక్కడి వైద్యశాఖను అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

వైద్యులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేసింది. సెలవులను రద్దు చేసింది వైద్య శాఖ. మే 15 వరకు విధులకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వారు ఉన్న ఫలంగా హెడ్ క్వార్టర్‌కు రిపోర్టు చేయాలంది. అత్యవసర సేవలకు అవసరమయ్యే మందులు, ఇతరత్రా వాటిని ముందే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని తెలిపింది. గోపాల్ పూర్ - చాంద్‌బలి మధ్య మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాళ మధ్యాహ్నానానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన ఫణి.. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles