Tiny "Fan" Missed Meeting Rahul Gandhi, And Then.. రాహుల్ ఔదార్యం.. బిజీ షెడ్యూల్ మధ్య చిన్నారి అభిమానికి ఫోన్

Kannur boy cries in not meeting rahul gandhi gets call

Rahul Gandhi, Kannur, Nandans favorite leader, Nandan, Nandan Rahul Gandhi, Kannur Kerala, Wayanad, Wayanad Congress, Congress, Rahul Gandhis fan, Kerala elections, Kerala polls, Lok Sabha elections, General Elections 2019, Kerala, Politics

The 7-year-old boy Nadhan from Kannur was disappointed as he failed to meet Rahul Gandhi. Little Nadhan cried out in grief as he failed to meet Rahul .and his pics went viral on social media. But surprising him, Rahul phoned him.

రాహుల్ గాంధీ ఔదార్యం.. బిజీ షెడ్యూల్ మధ్య చిన్నారి అభిమానికి ఫోన్

Posted: 04/19/2019 11:19 AM IST
Kannur boy cries in not meeting rahul gandhi gets call

తన అభిమాన నేతను కలిసేందుకు ఓ చిన్నారి ఏడు గంటల పాటు వేచినా.. అతని నిరీక్షణ ఫలించలేదని తెలిసి.. ఏడుస్తూ తన తండ్రితో కలసి ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అయితే ఆకస్మాత్తుగా ఆ చిన్నారికి అభిమాన నేత నుంచి ఫోన్ వచ్చింది. తనను కలవపోయినా.. తన అభిమాన నేత తనతో మాట్లాడారని తెలిసిన చిన్నారితో పాటు చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు.? ఆయన అభిమాన నేత ఎవరు అంటారా.? ఆ చిన్నారి కేరళ వయనాడ్ కు చెందిన నందన్. తన అభిమాన నేత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి.

చిన్నారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేశారు. ఈ విషయాన్ని వయనాడ్ కాంగ్రెస్ పేరుతో ఇటీవల ప్రారంభమైన ఫేస్ బుక్ పేజిలో కాంగ్రెస్ ఈ విషయాన్ని తెలిపింది. తన చిన్నారి అభిమాని కోరికను రాహుల్ గాంధీ తీర్చారని చెప్పుకోచ్చింది. అయితే ఈ విషయం రాహుల్ గాంధీకి వరకు ఎలా వెళ్లిందంటే.. రాహుల్ కోసం నిరీక్షించిన తన బిడ్డ కోరిక తీరకపోవడంతో తన బిడ్డ ఏడుస్తూ వెనక్కువచ్చిన విషయాన్ని ఆ చిన్నారి తండ్రి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అని తెగ వైరల్ అయింది. దీంతో కాంగ్రెస్ నేతలు విషయాన్ని వయనాడ్ పేజీకి ట్యాగ్ చేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, రాహుల్ గాంధీ కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వేళ, రాహుల్ ను కలిసేందుకు నందన్ అనే బాలుడు వచ్చాడు. వయనాడ్ కు వచ్చిన రాహుల్ ను కలిసేందుకు ఉదయం 5 గంటల నుంచి ఎదురుచూసిన నందన్, భద్రతా కారణాలతో కలవలేక నిరాశతో వెనక్కు వెళ్లాడు. రాహుల్ పై తన కుమారుడికి ఎంతో అభిమానమని, 'మోస్ట్‌ ఫేవరెట్‌ పర్సన్‌' అన్న ప్లకార్డుతో పాటు జేబుకు రాహుల్ ఫోటో పెట్టుకుని తన కుమారుడు వచ్చాడని తెలిపాడు. ఎంతోసేపు నిరీక్షించినా రాహుల్ ను కలవలేకపోగా, నిరాశకు గురయ్యాడని చెప్పారు. ఈ పోస్ట్ ను చూసిన రాహుల్ నందన్ తండ్రికి స్వయంగా కాల్ చేశారు. "హాయ్‌.. నేను రాహుల్‌ గాంధీని మాట్లాడుతున్నాను. నేను నా అభిమానితో మాట్లాడవచ్చా" అని అడిగారు. నందన్ తో కాసేపు మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Kannur  Nandan  Wayanad  Congress  Rahul Gandhis fan  General Elections 2019  Kerala  Politics  

Other Articles