liquor bottles unearthed in YCP leaders farm siezed మామిడి తోటలో విరగగాసిన మద్యం సీసాలు..

Liquor bottles unearthed in ycp leaders farm siezed

liquor bottles in mango farm, liquor bottles in YCP leaders farm, liquor bottles siezed, Rs 6 lakh liquor bottles siezed, sri ramulu reddy, liquor bottles, police search, Andhra Pradesh, Politics

police siezed the liquor bottles unearthed from kumbarlapalle of v kota mandal in chitoor district. After filing a case police said that the mango farm owner is a YSRCP leader and registered a case against him. Police said the worth of liquor is around Ra 6 lakh.

వైసీపీ నేత మామిడితోటలో విరగగాసిన మద్యం సీసాలు..

Posted: 03/30/2019 05:35 PM IST
Liquor bottles unearthed in ycp leaders farm siezed

ఎన్నికలు అనగానే మద్యం, విందుతో పాటు మనీ కూడా నీళ్లలా ఖర్చు అవుతుందన్నది పబ్లిక్ టాక్. అయితే మద్యం ఎంతగా ప్రవహిస్తే అంతగా ఓటర్లు సంతృప్తి చెందారని, అన్ని ఓట్లు తమకు పడతాయని నేతలు భావిస్తుంటారు. ఇక ఇక్కడ మరో విషయం ఏంటంటే ఎన్నికలనే టార్గెట్ చేసుకునే మందుబాబులు మూడు పుటలా మద్యం తాగుతూనే వుంటారన్నది కూడా నాయకులకు విధితమే. అందుచేతే ఎన్నికల వేళ ఎక్కువగా వారు క్వార్టరు బాటిళ్లనే అధికంగా పంచుతుంటారు.

ఈ ఉపోద్ఘాతమంతా మాకెందుకు చెబుతున్నారు అని అంటారా.? ఎన్నికల వేళ ఓ మామిడి తోటలో మద్యం సీసాలు విరగకాసాయి. అదేంటి మామిడి తోటలో మామిడి పళ్లు కాస్తాయి కానీ మద్యం సీసాలేంటా అంటారా.? చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ నేతకు చెందిన మామిడి తోటలో 170 మద్యం కేసులను దాచివుంచారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి తనఖీ చేయగా భారీగా మద్యం సీసాలు బయటపడ్డాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలం కుంభార్లపల్లెలోని మామిడి తోటలో మద్యం అక్రమ నిల్వలు ఉన్నాయన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 170 మద్యం కేసుల్లో 8,160 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా పంపిణీ చేసేందుకు వీటిని నిల్వ చేశారని భావిస్తున్నారు. మామిడితోట యజమాని శ్రీరాములురెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sri ramulu reddy  liquor bottles  police search  Andhra Pradesh  Politics  

Other Articles