ఎన్నికల కోడ్ అమల్లో వున్న సమయంలో ఎంతటి పెద్ద సెలబ్రిటీలు, వీవీఐపీలైనా.. ఎన్నికల కమీషన్ అధికారులకు, పోలీసులకు సహకరించాల్సిందే. అయితే ఒకే రోజు మూడు చోట్ల తనిఖీలు పూర్తి చేసుకుని ముందుకుసాగుతున్న వేళ్ల.. మరో ఎన్నికల అధికారుల బృందం తనిఖీల పేరుతో కారును.. ఆ తరువాత చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ను తనిఖీలు చేస్తే వెళ్లాల్సిన ప్రయాణానికి అడుగడుగునా అడ్డుపడితే ఎంతటి శాంతమూర్తులైనా అసహనం వ్యక్తం చేస్తారు.
ఇదే పరిస్థితి ఇప్పుడు తమిళనాడు స్టార్ హీరోయిన్ నమితకు ఎదురైంది. ఎన్నికల అధికారుల వరుస తనిఖీలతో అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రముఖ నటి నమిత.. ఈ విషయం ఎన్నికల అధికారులకు తెలియదు. ఎవరు ఏం చేప్పినా.. ఏం కారణాలు చెప్పినా.. వారి తమ విధులను తాము నిర్వహిస్తారు. దీంతో నడి రోడ్డుపై ఎన్నికల అధికారుల మళ్లీ తనిఖీలు చేయడంతో అమె వారిపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నటి నమిత వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ఓట్లకు నోట్లు విరజిమ్మడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు అలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. సేలం, కొండాలాంపట్టి సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆనంద్ విజయ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నటి నమిత కారును నిలిపి తనిఖీ చేయాలని చెప్పగా నమితతో పాటు ఆమె కారులో ఉన్న మరి కొందరు అందుకు అడ్డు చెప్పారు.
దీంతో అక్కడ నమితకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము తనిఖీలు చేస్తున్నామని, అందుకు సహకరించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చెప్పడంతో నటి నమిత వర్గం అంగీకరించారు. అయితే తనిఖీల్లో నమిత కారులో నగదు, ఇతర విలువైనవి లభించలేదు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఆమె కారుని పంపేశారు. దీనిపై అమె భర్త వీరేంద్ర చౌదరి వివరణ ఇస్తూ అప్పటికే మూడు చోట్ల నమిత కారు అధికారులు తనిఖీలు చేశారని, ఇక ఆనంద్ విజయ్ టీమ్ లోని సభ్యుడు అమె బ్యాగును కూడా తనిఖీ చేయాలని చెప్పడంతో అందుకు మహిళా అధికారికి కవాలని అమె చెప్పారని అంతేకానీ ఎన్నికల అధికారుల తనిఖీలకు నమిత అడ్డుచెప్పలేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more