YS Jagan files nomination for Pulivendula Assembly పులివెందుల నుంచి జగన్ నామినేషన్..

Ys jagan files nomination papers for pulivendula assembly

YS Jagan nomination, YS Jagan Mohan Reddy nomination, YS Jagan Pulivendula Assembly, YS Jagan files Nomination, YS Jagan, YS Jagan Mohan Reddy, Pulivendula Assembly, Nomination, YSRCP, Andhra Pradesh, politics

YSRCP chief YS Jagan Mohan Reddy filed his nomination from Pulivendula Assembly of Kadapa district. The leader of the opposition, appealed to the people to make his party win for the betterment of Andhra Pradesh's future.

పులివెందుల నుంచి జగన్ నామినేషన్.. ఈ గడ్డ బిడ్డనైనందుకు గర్వంగా వుంది

Posted: 03/22/2019 04:14 PM IST
Ys jagan files nomination papers for pulivendula assembly

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత జగన్ నామినేషన్ వేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం అధికారులకు ఇవాళ మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ పత్రాలను సమర్పించే ముందు ఆయన సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటుగా వైసీపీ నేతల సమక్షంలో ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు, పులివెందులలో జగన్ పై టీడీపీ అభ్యర్థి వెంకట సతీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

అంతకుముందు సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కడప గడ్డపై పుట్టినందుకు తానెంతో గర్వపడుతున్నానని, పులివెందులంటే వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రేమని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబంపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపుతూ వచ్చారని గుర్తు చేసుకున్నారు. కష్టంలోనూ గుండెధైర్యంతో ఎలా ఉండాలో తనకు ఈ గడ్డే నేర్పిందని అన్నారు. వందల నిందలు వేస్తున్నా, కుట్రలు చేస్తున్నా తొణకకుండా, బెదరకుండా, నిబ్బరంగా ఉండటాన్ని కూడా నేర్పించిందని చెప్పారు.

పులివెందులకు కృష్ణా నీరు తెచ్చేందుకు దివంగత మహానేత ప్రాజెక్టులను చేపడితే, జలయజ్ఞం, ధనయజ్ఞం అని విమర్శించిన వారు, ఇప్పుడు నీరు వచ్చేసరికి తామే ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మంచితనానికి విరుద్ధంగా చంద్రబాబు పాలన సాగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. అధికారం కోసం సొంత మామపై కుట్ర చేసి, వెన్నుపోటు పొడిచి చంపేసిన చంద్రబాబు, తన పాలనలో కుప్పంకు కూడా ఏమీ చేయలేదని, ఇప్పుడు పులివెందులకు వచ్చి తానే మంచి చేశానని వితండవాదన చేస్తున్నారని అన్నారు.

పులివెందులలో జేఎన్టీయూ కాలేజీని, ట్రిపుల్ ఐటీ, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, కడప నుంచి పులివెందులకు నాలుగు లైన్ల రహదారి, టీటీడీ ద్వారా అభివృద్ధి, 2,800 కోట్లతో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రతి మండల కేంద్రంలో కాలేజీ, నేషనల్ ఎకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్, పులివెందులకు రింగ్ రోడ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పైడిపాలెం ప్రాజెక్ట్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఎవరి హయాంలో వచ్చాయో చెప్పగలరా? అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YS Jagan Mohan Reddy  Pulivendula Assembly  Nomination  YSRCP  Andhra Pradesh  politics  

Other Articles