coconut breaker advt shocks private employees కొబ్బరి బోండాల దుకాణంలో జాబ్.. జీతం 32 వేలు..

Wanted coconut breaker advt shocks engineers and private employees

labour, wage, Thrissur, Advertisement, huge salaries for farmers, handsome full salary for farm labour, Cardamom Growers Association, Farmers Association, coconut breaker, coconut vending shop, chennai, Tamil Nadu

A shortage of workers coupled with competition from other sectors is driving wage levels in the farm sector. An advertisement in Tamil Nadu shows a shop keeper wants a coconut breaker, offering a handsome full of salary.

కొబ్బరి బోండాల దుకాణంలో జాబ్.. జీతం 32 వేలు..

Posted: 03/16/2019 06:14 PM IST
Wanted coconut breaker advt shocks engineers and private employees

చదువుకున్నోడి కంటే అలాంటివారే నయం అని వెనుకటికి మన పెద్దలు ఓ సామెత చెపుతుండేవారు. అప్పుడే కాదు... ఇప్పుడు కూడా అలాంటి రోజులే మళ్లి వచ్చాయా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పుస్తకాలతో కుస్తీ పట్టి పగలు రేయి చదువుకుని.. పుస్తకాలకు, ఫీజులకు లక్షల రూపాయలను వెచ్చించి చదివినా.. వచ్చేది వేల రూపాయల జీతమే. అయితే చదవుకున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నచితాక పనులు చేసే వారికి బ్రహ్మండమైన సమయం వచ్చింది.

మొన్నామధ్య దేవుడి సోంత రాష్ట్రమైన కేరళలో చెట్టు మీదున్న కొబ్బరికాయలను తెంచి కింద వేసుందుకు తగిన పనిలో నైపుణ్యమున్న వ్యక్తి కావాలంటూ ఓ ప్రకటన అందరినీ అబ్బురపర్చింది. ఇక మొన్నీమధ్య వ్యవసాయం పనులు తెలిపిన వ్యక్తులకు వసతి సౌకర్యంతో పాటు బోజనం కూడా ఉచితం ఇస్తూ నెలకు 22 వేల రూపాయల జీతం ఇస్తామన్న ప్రకటన కూడా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇక తాజాగా మరో అలాంటి ప్రకటనే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

చెన్నైలో ఓ పత్రికలో ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటయా అంటే... కొబ్బరిబొండాల షాపులో కొబ్బరి బొండాలను కట్ చేసి ఇచ్చే ఉద్యోగం. జీతం ఎంతో తెలుసా? రూ. 22,000 నుంచి రూ. 32,000 మధ్య. ఈ ప్రకటన చూసినవారు తొలుత అవాక్కయినప్పటికీ ఆ ప్రకటనలో తెలుపబడిని ఫోన్ నెంబరుకి ఫోన్ చేస్తే అది నిజమేనని తేలింది. కొబ్బరి బొండాలు కట్ చేసేవారికే 30 వేల రూపాయలు ఇచ్చేందుకు సదరు యజమాని రెడీ అవుతున్నాడంటే... ఇక లాభం ఏ రేంజిలో వుంటుందో ఊహించుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coconut breaker  coconut vending shop  Advertisement  chennai  Tamil Nadu  

Other Articles