natural coconut shells online sale at rs 1400 కొబ్బరి గెలకు కూడా లేని ధర.. చిప్పకా,,?

Amazon selling natural coconut shells on 55percent discount rate at just rs 1400

Online sales, E-Commerce, people anguish, Amazon, Sale of coconut shell, Highly Expensive price, Coconut, Shell, discount offer, IPS Rema Rajeshwari, weird news

E-Commerce gaint Amazon site selling natural coconut shells at just rupees 1400. This is 55 percent discounted price, An IPS officer Rema Rajeshwari shared this news through social media.

కొబ్బరి గెలకు కూడా లేని ధర.. చిప్పకా,,?

Posted: 01/17/2019 07:06 PM IST
Amazon selling natural coconut shells on 55percent discount rate at just rs 1400

మసిపూసి మారేడు కాయను చేయడం అంటే తెలుసా.? ఇత్తడిని పుత్తడిగా నమ్మించడం లాంటిదే. అయితే ఇలా చేస్తే మాత్రం నేరం. పోలీసులు, చట్టాలు భారత శిక్షాస్మృతి అన్ని వర్తించి.. న్యాయస్థానం తీర్పుల వరకు వెళ్తాయి. కానీ అదే తప్పును అన్ లైన్ దిగ్గజ సంస్థ చేస్తే అది తప్పు అని చట్టాలు, పోలీసులు ఎవరూ మాట్లాడరు. మరీ ప్రశ్నిస్తే.. వాడికి టాలెంట్ వుంది వాడు అమ్ముకుంటున్నాడు. నీకు టాలెంట్ వుంటే నువ్వూ అమ్మకో అని కూడా సూచిస్తారు. అసలు జరిగిందేంటి అంటారా..?

భారత దేశంలో ఇబ్బడిముబ్బడిగా లభించే కొ్బ్బరిచిప్పలకు అసలు ధరే లేదంటే అతిశయోక్తి కాదు. కానీ అలాంటి కొబ్బరి చిప్పకు కూడా ఏకంగా భారీ ధర పెట్టి దోచుకున్నవాడికి దోచుకున్నంత అంటూ చాటుతుంది ఈ కామర్స్ దిగ్గజం సంస్థ అమెజాన్. ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్స్ లో దొరకని వస్తువు అంటూ లేవు. మనం ఎప్పడూ చూడని సరికొత్త రకాలతో పాటు… మనకి ఎప్పుడూ… అందుబాటులో ఉండి మనం పనికిరాని వస్తువులుగా చూసే కొన్ని రకాల వస్తువులు కూడా ఇందులో ప్రత్యక్షం అవుతుంటాయి.

ఈ సంస్థ ఓ కొబ్బరి చిప్ప అమ్మకానికి పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ కొబ్బరి చిప్ప ప్రత్యేకత ఎమన్నా ఉందా అంటే …అది సాధారణ కొబ్బరి చిప్పే. కొబ్బరికాయ సుమారు రూ.20 నుంచి రూ.30 వరకూ ఉంటుంది. కాయ నుంచి తీసిన ఖాళీ చిప్పలు అంతకంటే తక్కువకే లభ్యమవుతాయి. కానీ అమెజాన్‌లో మాత్రం కొబ్బరి చిప్ప ఖరీదు రూ.1,400 అని దర్శనమిస్తుంది. కనీసం దానికి ప్రత్యేక రంగులు, ఇతర హంగులేమీ అద్దలేదు. దీని ఖరీదు చూసి ఆశ్చర్యపోయిన ఐపీఎస్‌ అధికారి రెమా రాజేశ్వరి ట్విటర్‌లో పంచుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్‌ చేశారు.

రెమా రాజేశ్వరి ట్వీట్‌పైనా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం నాచురల్‌ కోకోనట్‌ షెల్‌ కప్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ చిప్ప అసలు ఖరీదు రూ.3 వేలట. 55 శాతం ఆఫర్‌లో భాగంగా రూ.1,365కి లభిస్తోంది. ఇటీవలి కాలంలో కొబ్బరి చిప్పలతో చేసిన బౌల్స్‌ వాడడం ట్రెండ్‌గా మారింది. కొబ్బరి చిప్పలకు పాలిష్‌ చేసి, అందమైన రంగులు అద్దటంతో చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. కానీ ఇవి ఒక్కొక్కటీ రూ.100లోపే ఉంటున్నాయి. మరి సాధారణ కొబ్బరి చిప్పను ఏకంగా రూ.1,365కు అమ్మడం మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Online sales  E-Commerce  Amazon  Coconut  Shell  discount offer  IPS Rema Rajeshwari  

Other Articles