Kajal shares bitter jet airways experience జెట్ ఎయిర్ వేస్ సంస్థపై మండిపడ్డ నటి కాజల్ అగర్వాల్

Actress kajal agarwal shares bitter jet airways experience

Kajal Agarwal, actress, south indian actress, kajal agarwal jet airways bitter experiance, kajal bitter experiance, kajal jet airways, jet airways kajal agarwal, kajal agarwal, jet airways, bitter experiance, mumbai, social media

Kajal Agarwal is busy juggling her Tamil and Telugu projects and is very much in travel most of the days. She has obviously been miffed by a private aircraft operator and has posted on social media

జెట్ ఎయిర్ వేస్ సంస్థపై మండిపడ్డ నటి కాజల్ అగర్వాల్

Posted: 01/03/2019 12:16 PM IST
Actress kajal agarwal shares bitter jet airways experience

ప్రముఖ విమానయాన సంస్థలు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను అవమానపరుస్తున్నాయి. మొన్న పీవీ సింధూ, ఆ తరువాత జేసీ దివాకర్ రెడ్డి, అంతకుముందు శివసేన ఎంపీ.. విమానాల్లో కస్టమర్లు కొంచెం దురుసుగా ప్రవర్తించే వర్తించే ఫ్లయింగ్ రూల్స్.. సిబ్బంది, విమాన సంస్థల అలక్ష్యం, నిర్లక్ష్యంతో జరిగే తప్పిదాలకు వర్తించదేమన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. సెలబ్రిటీలు, ప్రముఖులకే ఇలాంటి ఘటనలు ఎదురైతే.. ఇక సర్వసాధారణ ప్రయాణికలును విమానయాన సంస్థలు ఎలా అటాడుకుంటాయో చెప్పనక్కర్లేదు.

ఆ మధ్యకాలంలో ఓ పెద్దాయన పట్ల విమానసిబ్బంది ప్రవర్తించిన తీరు.. పిడుగుద్దులను అందరూ చూశారు. అలాంటి దారుణాలు నమోదైతేకానీ మన కేంద్ర పౌరయాణశాఖ స్పందించదేమో అన్న సందేహాలు కూడా ప్రయాణికులలో రేకెత్తుతున్నాయి. తాజాగా జెట్ ఎయిర్ వేస్ లో ఎదురైన చేదు అనుభవాన్ని తన అభిమానులతో పంచుకుంది సినీ నటి కాజల్ అగర్వాల్. జెట్ ఎయిర్ వేస్ సంస్థ సహా సిబ్బందిపై కూడా అమె మండిపడింది. ప్రయాణికుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముంబై ఎయిర్ పోర్టుకు 75 నిమిషాల ముందుగానే తాము చేరుకున్నప్పటికీ కౌంటర్ స్టాఫ్ అయిన మోయిన్ అనే వ్యక్తి తమ సమయాన్ని వృథా చేశాడని ఆరోపించింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి డొమెస్టిక్ టెర్నినల్ వద్దకు విమానాన్ని తీసుకువచ్చి... మరో 30 నిమిషాల పాటు పార్క్ చేశారని మండిపడింది. గంటసేపు డోర్లను కూడా మూసి ఉంచారని మండిపడింది. ఎయిర్ వేస్ సిబ్బంది తీరుతో తామంతా ఎంతో ఇబ్బంది పడ్డామని తెలిపింది.  

కాగా దీనిపై జెట్ ఎయిర్ వేస్ సంస్థ స్పందించింది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అనాల్సిన చోట.. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం మిమల్ని త్వరలోనే కలుస్తామని స్పందించింది. జెట్ ఎయిర్ వేస్ స్పందన తీరుతో అగ్గి మీద గుగ్గులంలా మారిన కాజల్.. తనదైన శైలిలో బదులిచ్చింది.  మీ పేవర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినందుకు ప్రియమైన జెట్ ఎయిర్ వేస్ కు ధన్యావాదాలు అని పేర్కోంది. ఉదయం నాలుగు గంటలకు జరిగిన ఈ ఘటనతో తన రోజు ఇంకా కాంతివంతమైందని స్పందించింది కాజల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  actress  jet airways  bitter experiance  mumbai  social media  

Other Articles