Prabas petition in High court against Telangana Government గెస్ట్ హౌస్ సీజ్ పై.. హైకోర్టులో హీరో ప్రభాస్ పిటీషన్

Hero prabas petition in high court against telangana government

Hero Prabhas, prabhas rayadurgam guest house, telangana government, High court, Telangana

Hero prabas filed petition in High court against Telangana Government for siezing his guest house at rayadurgam, RangaReddy district.

గెస్ట్ హౌస్ సీజ్ పై.. హైకోర్టులో హీరో ప్రభాస్ పిటీషన్

Posted: 12/19/2018 12:02 PM IST
Hero prabas petition in high court against telangana government

తెలంగాణ ప్రభుత్వంపై బాహుబలి సమరశంఖం పూరించారు. హీరో ప్రభాస్ తెలంగాణ అధికారులపై న్యాయపోరాటం చేశడానికి సిద్దమయ్యారు. తన గెస్ట్ హౌజ్ ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. తాను అన్ని ధృవపత్రాలను పరిశీలించిన పిమ్మటే సదరు స్థలాన్ని కొనుగోలు చేశానని, అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వచ్చి తన గెస్ట్ హౌజ్ ను సీజ్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన న్యాయవాది పిటిషన్ ను దాఖలు చేయగా, నేడు దానిని విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించింది.  ప్రభాస్ సహా స్థానికంగా నివసిస్తున్న పలువురు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూమిని అక్రమించారని కూల్చివేసిన అధికారులు ప్రభాస్ గెస్ట్ హౌజ్ ను మాత్రం సీజ్ చేస్తూ నోటీసులు అంటించిన విషయం తెలిసిందే.

అయితే ప్రభుత్వ రెవెన్యూ అధికారుల చర్యలపై స్థానికులు కూడా మండిపడ్డారు. తమ ఆస్తులను జేసీబీలు తీసుకువచ్చి కూల్చివేసిన అధికారులు.. హీరో ప్రభాస్ కు చెందిన గెస్ట్ హౌజ్ ను మాత్రం కూల్చివేయకుండా.. సీజ్ చేసి నోటీసులు అంటిండమేంటని ప్రశ్నించారు. అందరికీ సమానంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ప్రముఖుల పట్ల వారి ఆస్తుల పట్ల ఒకలా వ్యవహరిస్తూ.. తమలాంటి వారిపట్ల మాత్రం మరోలా వ్యవహరించడం ఏంటని నిలదీశారు. కాగా, ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న న్యాయపోరాటంతో స్థానికులు తమకు బాహుబలి అండ లభించిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles