Revanth Reddy On Telangana Assembly Election Results కొడంగల్ లో ఓటమిపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

Telangana elections 2018 revanth reddy on telangana assembly poll results

telangana elections results, Revanth reddy, Ruling party, EVMs, patnam narender reddy, uttamkumar reddy, telangana elections 2018, Telangana assembly elections, TRS, jaggareddy, dk aruna, ponnala lakshmaiah, revanth reddy, Congress, Maha kutami, Telangana Politics

Telangana elections 2018: Telangana Congress Working President A Revanth Reddy said whatever the results may be, Congress will work on behalf of the people.

ITEMVIDEOS: కొడంగల్ లో ఓటమిపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

Posted: 12/11/2018 02:57 PM IST
Telangana elections 2018 revanth reddy on telangana assembly poll results

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమి తమపై మరింత బాధ్యతను పెంచిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. ఫైర్ బ్రాండ్ రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తప్పిదాలను మరింతగా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలిచినా ఓడినా.. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి వారి సమస్యలపై పోరాడుతానన్నారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చందుకు కూడా తాము ప్రజల తరపున పోరాడుతామని అన్నారు.

ఎన్నికల వేళ ప్రజలను బురిడీ కొట్టించేందుకు మానిఫెస్టోతో పాటు అటు ముఖ్యమంత్రి, ఇటు కేటీఆర్ లు ప్రచారం సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని వాటన్నింటినీ నెరవేర్చేలా తాము ప్రజలపక్షాన నిలుస్తామని అన్నారు. హామీలు ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓడిపోతే కుంగిపోవడం.. గెలిస్తే పొంగిపోవడం కాంగ్రెస్‌ పార్టీ లక్షణం కాదన్నారు. 1956 నుంచి అనేక సార్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ గెలుపు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటంబ పాలనకు పట్టం కట్టినట్లు, రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలు ఇచ్చిన లైసెన్స్‌ కాదని సూచించారు.

ఈ ఫలితాలతో ప్రజల తరఫున వారి సమస్యలను లేవనెత్తడంలో ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఇప్పటికైనా కేసీఆర్‌ తన వ్యవహారి శైలిని మార్చుకొని.. ఫామ్‌హౌస్‌ నుంచి కాకుండా.. ప్రజల మధ్య ఉండి పాలన చేయాలని సూచించారు.  తక్షణమే తెలంగాణ అమరవీరులను గుర్తించి ఆదుకోవాలని, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా, విద్యార్థులకు మంచి విద్యను అందించేలా పాలన చేయాలని సూచించారు. చంద్రబాబుతో పొత్తు కారణంగానే కూటమి ఓటమి చెందిందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఎన్నికల ఓటమిపై అందరం కూర్చొని విశ్లేషణ చేస్తామని, ఆ తర్వాతే కారణాలు చెబుతానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles