Telangana top congress leaders lagging behind తెలంగాణ ఎన్నికలలో ఓటమి అంచున కాంగ్రెస్ అగ్రనేతలు

Telangana elections 2018 telangana top congress leaders lagging behind

telangana elections results, telangana elections 2018, Telangana assembly elections, TRS, jaggareddy, dk aruna, ponnala lakshmaiah, revanth reddy, Congress, Maha kutami, Telangana Politics

Telangana elections 2018: People of telangana voted in favour of ruling party TRS, where even top telangana leaders lagging behind the victory mark.

తెలంగాణ ఎన్నికలలో ఓటమి అంచున కాంగ్రెస్ అగ్రనేతలు

Posted: 12/11/2018 10:54 AM IST
Telangana elections 2018 telangana top congress leaders lagging behind

తెలంగాణలో ఈ నెల 7వ తేదీన జరగిన ఎన్నికలలో ఓటరు తీర్పు అధికార టీఆర్ఎస్ పార్టీవైపే వుంది. కౌంటింగ్ ప్రారంభంలో పార్టీ అభ్యర్థులకు, శ్రేణులతో పాటు కార్యకర్తలలో కూడా అత్యంత ఉత్కంఠకు గురి చేసింది. కారు గతంలో కన్నా అధికస్థానాల్లో దూసుకుపోతుండగా, తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు పోన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునితాలక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, దామోదర రాజనర్సింహా, జీవన్ రెడ్డి తదితరులు వెనుకంజలో పడ్డారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలబడిన రేవంత్ రెడ్డి తొలి రౌండ్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించినా.. తాజాగా ఫలితాలు వెలువడే సమయానికి వెనకంజలో వున్నారు. ఇదే సమయంలో ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తమ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కన్నా వెనుకంజలో ఉన్నారు. మధిరలో అత్యధికంగా 90 శాతానికి మించిన పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.

ఇటు మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విజయం దిశగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ మహాకూటమి అభ్యర్థి, మాజీ ఉఫముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై 5,335 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా 39,000 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. మరోవైపు చేవెళ్లలో మహాకూటమి అభ్యర్థి కేఎస్ రత్నంపై టీఆర్ఎస్ నేత కాలే యాదయ్య 11,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana elections results  TRS  MIM  BJP  Congress  Maha kutami  Telangana Politics  Telangana Politics  

Other Articles