TDP MLA Ravela joins Janasena జనసేనలోకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు..

Former ap minister ravela kishore babu joins jana sena

pawan kalyan, janasena, ravela kishore babu, former minister, ravela kishore babu joins janasena, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, Pawan Kalyan kostandhra yatra, Pawan Kalyan on caste politics, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan welcomes former minister ravela kishore babu into janasena, who recently quits tdp.

ITEMVIDEOS: జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు..

Posted: 12/01/2018 12:58 PM IST
Former ap minister ravela kishore babu joins jana sena

ఆంద్రప్రదేశ్ లో బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తరహా కుల రాజకీయాలు వస్తే రాష్ట్ర అభివృద్ది కేవలం కొందరు కుటుంబాల అభివృద్దిగా మారిపోతుందుని జనసేన అధినేత, పపర్ స్టార్ పవన్ కల్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. ఈ కులు రాజకీయాలతో ప్రజలెవరికీ అభివృద్ది ఫలాలు అందవని.. దీంతో భవిష్యత్ తరాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కోక్క పార్టీ ఓక్కొక్క సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ దానిని పెంచుకుంటూ పోతున్నాయని విమర్శించారు.

ఇది ఇలాగే కోనసాగితే తెలంగాణ రాష్ట్ర ఉధ్యమం తరహాలో ఏపీలో కులరాజకీయాల వ్యతిరేక ఉధ్యమాలు కూడా వస్తాయని అయన అందోళన వ్యక్తం చేశారు. కుల రాజకీయాలతో రాష్ట్రంలోని ప్రజానికంలో ఎవరికి సుఖశాంతులు వుండవని, దారుణ పరిస్థితులు ఎదురవుతాయని పవన్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది పనులకు కుల రాజకీయ వ్యవస్థ సమాధి వేస్తుందని అన్నారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర పునర్విభనజన ఉధ్యమంలో చాలా నలిగిపోయారని పవన్ పేర్కోన్నారు.

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు టీడీపీ పార్టీకి రాజనామా చేసి జనసేనలో చేరిన సందర్భంగా ఆయనను సాదరంగా పార్టీలోకి అహ్వానించిన పవన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాజాగా అధికారంలోకి వచ్చే రాజకీయా నాయకులకు కులాలపైన సంపూర్ణమైన అవగాహన లేకపోతే సమాజాంలో అభద్రతాభావం ఏర్పడుతుందని, ప్రజల్లో  అశాంతి నెలకొంటుందని అన్నారు. కుల రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తాను ఆయన ప్రభుత్వానికి మద్దుతు పలికానని పవన్ అన్నారు. అయితే కులరాజకీయాలను పెంచి పోషించి లబ్దిపోందే విధంగా టీడీపీ కూడా తయారైందని ఆయన విమర్శించారు.

అంతేకాదు రాష్ట్రంలోని ఏమూలనున్న నియోజకవర్గానికి వెళ్లినా వందల కోట్ల అవినీతి జరిగిందనన్నారు. ప్రజల్లో భద్రతాభావం కనిపించలేదని దుయ్యబట్టారు. అధికార ప్రభుత్వం శాంతిభద్రలను కాపాడలంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ పార్టీ నేతలు, సాక్షత్తు చట్టసభల్లో సభ్యులుగా వున్నవారు అధికారులపై దాడులు, అడపడుచులపై అకృత్యాలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నా.. అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నా వారిని నియంత్రించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని పవన్ ధ్వజమెత్తారు.

అనంతరం మాట్లాడిని రావెల కిషోర్ బాబు.. రాష్ట్రంలో వున్న రాజకీయ పార్టీలో తమ స్వార్థం, తమ పార్టీ నేతల స్వార్థాన్ని చూసుకోవడంలోనే నిమగ్నం అయ్యాయనన్నారు. ప్రజలకు ఎంతోకోంత సేవచేయగలిగే రాజకీయ వ్యవస్థ రావాలనే తాను జనసేనలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వాల హాయంలో ప్రజాస్వామ్యం దోపిడీస్వామ్యంగా మారిందని విమర్శించారు. త్మాభిమానాన్ని చంపుకోలేకే తాను అధికార టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని చెప్పారు. కుల రాజకీయాలతో భవిష్యత్ తరానికి ఇబ్బందులు వస్తాయన్నారు.

కులం పట్టింపులు లేని సమాజం కోసం పవన్ నడుం చుట్టారని, ఈ మార్పు దేశ భవిష్యత్తకే పెనుమార్పుగా తయారవుతుందని అకాంక్షించిన తాను.. జనసేన సిద్దాంతాలు నచ్చి పార్టీలోకి చేరానన్నారు రావెల. పవన్ కులరహిత సమాజ వ్యవస్థను తీర్చిదిద్దే పోరాటంలో ాను సమిధగా మారేందుకు సిద్దమని అన్నారు. అవినీతి, దుర్మార్గాలతో వ్యవస్థలను ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయని రావెల అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  ravela kishore babu  former minister  east godavari  andhra pradesh  politics  

Other Articles