Indepedents to win more than 10 seats: Lagadapati ఇండిపెండెంట్ల హవా: లగడపాటి జోస్యం

Telangana elections 2018 indepedents to win more than 10 seats lagadapati rajagopal

telangana elections 2018, Telangana assembly elections, Lagadapati rajagopal, pre poll survey, lagadapati survey, independents, narayan pet, adilabad bodh, Congress, Maha kutami, Telangana Politics

Former member of parliament Lagadapati rajagopal in his pre-poll survey, left major political parties embarrased sensing that independents will win nearly 10 seats in december 7th elections.

తెలంగాణ ఎన్నికలలో ఇండిపెండెంట్ల హవా: లగడపాటి జోస్యం

Posted: 11/30/2018 02:14 PM IST
Telangana elections 2018 indepedents to win more than 10 seats lagadapati rajagopal

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వున్నా అయన తెలియని, ఆయన పేరు ఎరుగని తెలుగు ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. తనదైన శైలిలో ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో దిట్ట. ఆయన గతంలో వెలువరించిన పలు సర్వేలు నూటికి 99.9శాతం నిజమయ్యాయి. దీంతో ఆయన సర్వేలపై అందరికీ అంత మక్కువ. లగడపాటి సర్వే వివరాల కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆయన సర్వే వివరాల కోసం ప్రజలు ఎదురుచూస్తుండగా, ఆయన మాత్రం తన సర్వే వివరాలు డిసెంబర్ 7వ తేదన వెల్లడిస్తానని చెప్పడంతో అందరూ అసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లెక్కింపుకు ముందే రాష్ట్రంలో రానున్న ప్రభుత్వం ఎవరిదనే అంచనాలపై ఆయన పూర్తిగా క్లారీటీ ఇస్తుండటంతో ఫలితాలను చూసి తమ అంచనాలు తప్పాయిన్న కొందరు పార్టీ శ్రేణుల కలత చెందకుండా చేస్తుంది.

కాగా ఉత్కంఠగా మారిన ఎన్నికలపై లగడపాటి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. తన అభిప్రాయాన్ని స్వామివారి సమక్షంలో ఆలయ ఆవరణలోనే వెల్లడించారు. లంగాణ ఎన్నికల్లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని తిరస్కరిస్తున్నారని అన్నారు. పార్టీల ప్రలోభాలకు లొంగకుండా.. స్వతంత్ర అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 8 నుంచి 10 మంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారంటున్నారు.

అయితే గెలుపోందే వారి పేర్లను రోజుకు ఇద్దరి చోప్పున ప్రకటిస్తానని చెప్పిన ఆయన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్ పేటలో శివకుమార్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ లో అనిల్ జాదవ్ గెలవబోతున్నట్లు వారి పేర్లతో సహా చెప్పారు. తనకు పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేదంటున్నారు లగడపాటి. తెలంగాణ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఉన్నారని.. డిసెంబర్ 7న సాయంత్రం పూర్తి ఫలితాలు ప్రకటిస్తానన్నారు. స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని రాజగోపాల్ బాంబ్ పేల్చడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles