assaduddin owaisi sensational comments on trs టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వ స్టీరింగ్ మన చేతుల్లో: ఎంఐఎం

Aimim leader assaduddin owaisi sensational comments on trs

Asaduddin Owaisi sensational comments, Asaduddin Owaisi TRS Steering, TRS, MIM, telangana elections 2018, Congress, Asaduddin Owaisi, Telangana, Politics

AIMIM president Asaduddin Owaisi sensational comments on TRS, says if kcr government comes again into power, the steering will be in the hands of his party.

టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వ స్టీరింగ్ మన చేతుల్లో: ఎంఐఎం

Posted: 11/28/2018 03:49 PM IST
Aimim leader assaduddin owaisi sensational comments on trs

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య ఫ్రెండ్లీ పోటీ మాత్రమే వుందని అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేస్తే.. టీఆర్ఎస్ పార్టీని చులకన చేసే విధంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఫ్రభుత్వం ఏర్పడితే తమ చేతుల్లోనే స్టీరింగ్ వుంటుందని, అందుకని ఆ పార్టీనే మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేలా.. ముస్లింలు అందరూ టీఆర్ఎస్ కే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి అవగాహన కుదిరిందో తెలియదు కానీ తమ అభ్యర్థులు లేని చోట, కేవలం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వున్న చోట ప్రత్యర్థి పార్టీలను ఓడించాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం నేతలు టీఆర్ఎస్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ చేతుల్లోకే ప్రభుత్వ పగ్గాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత రాత్రి ప్రచారం నిర్వహించిన ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ, ప్రజాకూటమికి బుద్ధి చెప్పాలని ఒవైసీ పిలుపునిచ్చారు. అంతేకాదు, ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న టీఆర్ఎస్‌కు ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రహ్మత్‌నగర్‌ డివిజన్‌ హబీబ్‌ఫాతిమా నగర్‌, సంజయ్‌నగర్‌ కూడలిలో నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన... ప్రభుత్వం ఏర్పాటు చేసిన 236 మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, ఒక్కోక్కరిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు.

అయితే ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘లేని మామ కన్నా.. గుడ్డి మామ నయం’ అన్నట్లు టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ గెలిస్తే స్టీరింగ్‌ మన చేతుల్లోనే ఉంటుందని చమత్కరించారు. ఎనిమిది చోట్ల ఎంఐఎం పోటీ చేస్తోందని, మజ్లిస్‌ బరిలో లేనిచోట టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తీరు ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని ఒవైసీ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  MIM  telangana elections 2018  Congress  Asaduddin Owaisi  Telangana  Politics  

Other Articles