janasena will emerge into power: pawan 2019లో జనసేనే అధికారంలోకి వస్తుంది: పవన్

Pawan kalyan says his party will contest independently in elections

pawan kalyan, janasena, chennai, tamil nadu, BJP, Congress, TDP, JSP, Kamal Hassan, andhra pradesh, politicspawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan kamal hassan meet, Pawan Kalyan chennai yatra, Pawan Kalyan south indian politics, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan says his party will contest the forthcomming elections independently and will emerge into power.

జనసేనది ఒంటరి పోరాటమే.. తేల్చేసిన పవన్ కల్యాణ్

Posted: 11/22/2018 11:23 AM IST
Pawan kalyan says his party will contest independently in elections

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీనే కాదు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జనసేనాని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదని, అన్ని చోట్లా తమ పార్టీ పోటీచేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రతి విషయంపై వివరణ ఇవ్వడం తనకు ఇష్టం ఉండదని, మళ్లీ చెబుతున్నా... వైసీపీతో పొత్తు ఆలోచన లేదని, జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే జనసేనతో పాటు తాము వున్నామని, పవన్ కల్యాణ్ తో కలసి నడుస్తామని ప్రకటించిన వామపక్షాలు పరిస్థితి ఇప్పుడు డోలాయమానంలో పడింది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో తాము బరిలో నిలిచే అవకాశం లేకుండా పోయిందని.. అక్కడ కూడా పలు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడదామని అనుకున్నామని పవన్ చెప్పారు. అయితే తెలంగాణలోని తమ అభిమానులు ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇవ్వాలి అని ఎదురుచూస్తున్నారని, ఈ విషయంల్లో ఎలా వ్యవహరించాలో అభిమానులకు సూచించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పవన్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో కూడా తమ పార్టీ గొంతుకును వినిపించేందుకు తాను ప్రయత్నిస్తున్నాని చెప్పారు.

దక్షిణాదిలో మరింత మంది నీతిమంతులైన నేతలు రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిలాషించారు. జనసేన పార్టీ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా చెన్నైలో పర్యటించారు. గత ఎన్నికల్లో అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతిచ్చానని, కానీ చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇసుక మాఫియా, సాగునీటి ప్రాజెక్టులు.. ఇలా ప్రతి నియోజకవర్గంలో దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా అవినీతి జరిగిందని అన్నారు.

ఇక రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతైన జగన్‌ను తీసుకుంటే ఆయనపై ఉన్న కేసుల కారణంగా కనీసం నీతిపరుల అవసరంపై మాట్లాడే ధైర్యం ఆయన చేయలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏపీ నేతలను ద్వితీయశ్రేణి పౌరులుగానే చూస్తున్నారని, చెన్నైకి ఎప్పుడొచ్చినా తనకు అలాంటి భావన కలగలేదన్నారు. యువత ముందుకు వస్తే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలదని జల్లికట్టు పోరాటం నిరూపించిందని పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ వేలుపెట్టడం ఇక్కడి యువతకు నచ్చలేదని, కేంద్రం తీరు వల్లే జల్లికట్టు లాంటి పెద్ద పోరాటం వచ్చిందన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు చొరవ తీసుకుంటున్న కాంగ్రెస్‌ అనుకూల కూటమిలోనూ తనకు చేరే ఆలోచన లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీలు ఏ ఎండకు ఆ గొడుగు వడ్డుతాయని, చంద్రబాబును నమ్మడానికి జనం సిద్ధంగా లేరని, ఆయనకు రిటైర్మెంట్‌ దగ్గరపడింది కాబట్టే, పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలవలేని లోకేశ్ ను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని చేశారన్నారు. వీటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు జనసేన పార్టీతోనే ముడిపడి ఉందని, 2019 ఎన్నికల్లో తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానని పవన్‌ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  chennai  tamil nadu  BJP  Congress  TDP  JSP  Kamal Hassan  andhra pradesh  politics  

Other Articles