Konda Vishweshwar Reddy to join Congress కాంగ్రెస్ లో చేరునున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Telangana s richest mp konda vishweshwar reddy leaves trs to join congress

Telangana, States and union territories of India, Politics of India, Konda Vishweshwar Reddy, Telangana movement, Telangana Rashtra Samithi, Indian general election, Rahul Gandhi, Sonia Gandhi, Congress, Delhi, Kumar, Khuntia, President, TRS Lok Sabha, TRS, Telangana politics

Konda Vishweshwar Reddy met Congress Chief Rahul Gandhi in Delhi a day after his resignation from K Chandrasekhar Rao's (KCR) Telangana Rashtra Samithi (TRS).

టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన ఎంపీ.. త్వరలో కాంగ్రెస్ లో చేరిక..

Posted: 11/21/2018 12:45 PM IST
Telangana s richest mp konda vishweshwar reddy leaves trs to join congress

ఎన్నికలకు సరిగ్గా పక్షం రోజుల సమయం మాత్రమే మిగిలివున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌కు జైకొట్టారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో ఆయన తెలంగాణ తాజా రాజకీయాలపై చర్చించారు. భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియాతో కలిసి మాట్లాడిన విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ నెల 23న మేడ్చల్ లో జరిగే బహిరంగ సభలో.. సోనియా గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరబోతున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తన నియోజకవర్గంలోనూ ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని.. అధికార పార్టీ ఎంపీగా ఉండి కూడా వాటిని సమస్యల్ని పరిష్కరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లగా ఆ పార్టీ విధానాలు మారిపోయాయని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ఉద్యమకారుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. టీఆర్ఎస్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. రాష్ట్రానికి న్యాయం చేయాలంటే కాంగ్రెస్‌కే సాధ్యమవుతుందన్నారు.

వ్యక్తిగత వైరంతో పార్టీని వీడలేదన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. ఒకవేళ వ్యక్తిగతంగా విభేదాలుంటే.. నాలుగేళ్ల క్రితమే పార్టీ నుంచి బయటకు వచ్చేవాడినన్నారు. పార్టీపరమైన నిర్ణయాలను విభేదించే పార్టీని వీడినట్లు తెలిపారు. కేసీఆర్ కొన్ని మంచి పథకాలు చేపట్టినా.. తర్వాత పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. అలాగే చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు కొండా.

ఇది ఆరంభం మాత్రమే.. త్వరలో టీఆర్ఎస్‌కు అసలు సినిమా చూపిస్తామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా అన్నారు. త్వరలోనే మరికొందరు నేతలు తమ పార్టీలో చేరబోతున్నారని పెద్ద బాంబ్ పేల్చారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు కూడా హస్తం గూటికి వస్తారన్నారు. ఎవరెవరనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్‌ పార్టీతో పాటు పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ.. తెలంగాణ భవన్ కు మూడు పేజీ లేఖ రాసి పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles