Here are the Photo of 'Bike-borne Suspects' ఈ ముష్కరుల సమాచారం అందిస్తే రూ.50 లక్షల రివార్డు..

Amritsar blast govt announces rs 50 lakh reward for information leading to suspects

amritsar, amritsar grenade attack, amritsar grenade attack photo, punjab police, rajasansi, Nirankari Bhawan, bike-borne miscreants, amarinder singh, amritsar blast, sant nirankari mission, punjab, crime

A day after the grenade attack at Nirankari Bhawan complex in Amritsar's Rajasansi village, the Punjab Police released a CCTV footage showing two bike-borne miscreants who are suspected to be involved in the attack.

ఈ ముష్కరుల సమాచారం అందిస్తే రూ.50 లక్షల రివార్డు..

Posted: 11/19/2018 11:13 AM IST
Amritsar blast govt announces rs 50 lakh reward for information leading to suspects

పంజాబ్ లో ఉగ్రదాడికి పాల్పడి ముగ్గరి మరణానికి, మరో 20 మంది గాయపడటానికి కారణమైన ముష్కరులను పట్టించినా.. లేక వారి సమాచారం అందించిన వారికి రివార్డును అందజేస్తామని ముఖ్యమంత్రి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. రాజసాని గ్రామంలోని సంత్ నిరాకారి మిషన్ లో జరుగుతున్న ఆద్యాత్మిక కార్యక్రమంలో పాల్గోన్న భక్తులపై అగంతకులు గ్రెనైడ్ లు విసిరి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

కాగా, ముష్కరులు గ్రనైడ్ దాడులు విసిరి పారిపోతుండగా, అక్కడి రోడ్డుపైన వున్న సీసీటీవీలు వారి ఫుటేజ్ ని నిక్షిప్తం చేయడా, వారే గ్రానైడ్ లు విసిరి పారిపోతున్న అనుమానితులుగా గుర్తించిన పోలీసులు.. ముష్కరుల ఫోటోలను విడుదల చేశారు. ఈ దాడికి పాల్పడిన వారి గురించిన సమాచారం తెలియజేస్తే రూ. 50 లక్షల రివార్డును అందిస్తామని పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 181కు ఫోన్ చేయాలని, వారి వివరాలు అత్యంగ గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇది ఖలిస్థాన్, కశ్మీరీ ముఠాల పని కావచ్చని అభిప్రాయపడ్డ అమరీందర్, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. కాగా, సీసీటీవీ ఫుటేజ్ వివరాల ప్రకారం, వీరిలో ఒకరు జీన్స్, షర్ట్ ధరించగా, మరొకడు కుర్తా పైజమా వేసుకుని ఉన్నాడు. వీరిద్దరి ముఖాలకూ మాస్క్ లు ఉండటంతో వీరెవరన్నది స్పష్టంగా తెలియడం లేదు. అయితే వీరు వినియోగించిన పల్సర్ వాహనం అని తెలుసుకున్న పోలీసులు గత రెండేళ్ల నుంచి పల్సర్ వాహనాలను కొనుగోలు చేసిన వారి జాబితాను సేకరించారు. ఆ దిశగా కూడా తమ దర్యాప్తును వేగవంతం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amarinder singh  amritsar blast  rajasansi  sant nirankari mission  punjab  crime  

Other Articles