Sexual harassment axe on Sangh figure మీటూ: మరో బీజేపి నేతకు తాకిన సెగ.. పదవి ఊస్ట్

Bjp sacks sanjay kumar over sexual harassment allegations

#MeToo campaign, #MeToo India, #MeToo, Bharatiya Janata Party, Hindutva, Uttarakhand Legislative Assembly, Sanjay Joshi, Baby Rani Maurya, Sanjay kumar, RSS, sexual harrassment, politics

The BJP removed its Uttarakhand organisation General Secretary, and RSS figure Sanjay Kumar from his post after a woman party worker accuses him of sexual harassment.

మీటూ: మరో బీజేపి నేతకు తాకిన సెగ.. పదవి ఊస్ట్

Posted: 11/05/2018 10:45 AM IST
Bjp sacks sanjay kumar over sexual harassment allegations

యావత్ ప్రపంచంలో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆకాశంలో సగానికి సహకరిస్తామంటూనే అవకాశాల కోసం వచ్చిన మహిళలపై పలు ప్రాంతాల్లో మగమృగాళ్లు అడవారిపై అకృత్యాలకు పాల్పడటంతో తమపై లైంగిక దాడులకు పాల్పడిన మగమృగాళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ.. అరోపణలు గుప్పిస్తున్న బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇందుగలదు అందులేదన్న వత్యాసం లేకుండా ఎక్కడ ఏ రంగంలో చూసినా.. అక్కడ ఈ వేధింపులు జరిగినట్లు బాధితురాళ్ల పిర్యాదులతో స్పష్టం అవుతుంది.

ఇక ఇందులో సామాన్యుల నుంచి ప్రజలకు నీతులు చెప్పే ప్రముఖుల స్థాయి వరకు ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బీజేపికి చెందిన కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ఈ లైంగిక దాడుల అరోపణలతో తన కేంద్ర మంత్రి పదవినే కొల్పోవాల్సి వచ్చిన ఘటను కూడా మనకు తెలిసిందే. అయితే ఈ ఉద్యమం దెబ్బకు బాలీవుడ్ నటులు నానాపటేకర్, అలోక్ నాథ్ లు సినిమా ఆఫర్లను పోగొట్టుకోగా, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ కీలక ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా మీటూ ఉద్యమం దెబ్బకు బీజేపీలో రెండో వికెట్ పడింది.

ఉత్తరాఖండ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్ కుమార్ ను బాధ్యతల నుంచి తప్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. కుమార్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా బీజేపీ కార్యకర్త ఆరోపించిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ లైంగికవేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కుమార్ ను తప్పించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సొంత పార్టీ నేతలు కూడా సంజయ్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ మరింత నష్టపోకుండా బీజేపీ హైకమాండ్ తెలివిగా నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : #MeToo  BJP  sanjay kumar  #MeToo India  sexual harrassment  politics  

Other Articles