60 lakh votes missing in AP alleges YCP ఏపీలో 60 లక్షల ఓట్లు మిస్సింగ్: అంబటి

60 lakh votes missing in andhra pradesh alleges ambati rambabu

Ambati rambabu, YSRCP, Voters list, 60 Lakh votes misising, AP CEO, Ruling party, TDP, Andhra pradesh Government, politics

YSRCP Spokesperson Ambati Rambabu alleges that the andhra pradesh ruling party TDP has deleted nearly 60 lakh votes from the list.

మా ఓట్లు జాబితాలో లేవేంటీ.? ఇది ఏపీ జనం మాట: అంబటి

Posted: 11/01/2018 02:52 PM IST
60 lakh votes missing in andhra pradesh alleges ambati rambabu

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగించే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. పల్స్ సర్వే, రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతో ప్రజలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, ప్రభుత్వ పాలన బాగోలేదని బటన్ నొక్కితే వారి ఓట్లు గల్లంతు అవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా నకిలీ ఓటర్లను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో వైసీపీ నేతలతో ఎన్నికల అధికారి సిసోడియాను కలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ 60 లక్షల ఓట్లను ప్రభుత్వం తొలగించిందని అంబటి రాంబాబు అరోపించారు. వీటిలో కడపలో 4.90 లక్షల ఓట్లు, కర్నూలులో 6.31 లక్షల ఓట్లు, చిత్తూరులో 4 లక్షల ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని స్వస్థలం సత్తెనపల్లిలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్లు సైతం గల్లంతు అయ్యాయని విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి సిసోడియా దృష్టికి తీసుకెళ్లామని అంబటి తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 40 లక్షల వరకూ నకిలీ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల గిమ్మిక్కులు చేయడంలో చంద్రబాబు ఉద్ధండుడనీ, ప్రజలు జాగ్రత్తగా ఓటును కాపాడుకోవాలని సూచించారు. ఇక తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్భవించిన తెలుగుదుశం పార్టీ ఇప్పుడు అదే పార్టీతో జతకట్టడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్లు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ తమను విమర్శించిన పార్టీ ఇప్పుడెలా కాంగ్రెస్ తో జతకడుతుందని నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles