''We hasn't been oppressed in british rule'' ‘‘మరో వందేళ్లు వారి పాలన’’ బీఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

Britishers should have ruled india for 100 more years bsp leader

Dharamveer Singh, BSP, Mayawati, British rule, freedom fighters, Rajasthan assembly elections 2018, Rajasthan assembly election 2018, controversial statement, social media, uttat pradesh

Bahujan Samaj Party (BSP) leader Dharamveer Singh Ashok while delivering a speech in Rajasthan's Didwana said, "Britishers should've ruled this country for 100 more years. Had that happened, ST/ST/OBCs wouldn't have been oppressed.

‘‘మరో వందేళ్లు వారి పాలన’’ బీఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

Posted: 10/26/2018 04:54 PM IST
Britishers should have ruled india for 100 more years bsp leader

స్వయం పాలన కోసం అంగ్లేయులతో పోరాడి.. స్వతంత్ర్య మా జన్మహక్కు అంటూ నినదించి.. వందేమాతరం అంటూ బ్రిటీష్‌ పాలకుల ఒంట్లో భయాన్ని రగల్చిన ఎందోరో సమరయోధుల త్యాగాలను మనం అనేక సందర్భాల్లో గుర్తుచేసుకుంటాం. యావత్ భారతవని స్వతంత్ర్య దినాన్ని, గణతంత్ర దినాన్ని జాతీయ పండుగలుగా జరుపుకుంటుంది. సమరయోధుల త్యాగాలను కీర్తిస్తూ.. వారి అడుగుజాడల్లో నడిచేందుకు యావత్ భారతీయ యువత ముందుకు సాగుతుంది.

కానీ వాటన్నింటినీ తోసిరాజుతూ ఓ బీఎస్సీ నేత మాత్రం అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. అగ్గిరాజేశాడు. భారత దేశాన్ని అంగ్లేయులు మరో వందేళ్ల పాటు పాలించి ఉంటే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమగ్రాభివృద్ధి సాధించే వారని బీఎస్సీ ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ ధరంవీర్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో వందేళ్లు వారి పాలనా కాలం కొనసాగి ఉంటే బాగుడేందన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో ధరంవీర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఈ దేశానికి అంబేడ్కర్‌ వంటి దళిత నాయకుడు లభించాడంటే అది బ్రిటీష్‌ వారి పుణ్యమే. ఇప్పటి లాంటి పాలకులు ఉండి ఉంటే ఆయనకు ఏ పాఠశాలలోనూ కనీసం చదువుకునేందుకు సీటు దొరికేది కాదు. దేశంలో అణగారిన వర్గాలకు ఆయన సేవలందించే అవకాశం ఉండేది కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ధరంవీర్‌ వ్యాఖ్యలపై విపక్ష పార్టీ నాయకులు మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహానుభావులు చేసిన త్యాగాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగా ఆయనకు ఆంగ్లేయులపై అభిమానం ఉంటే బ్రిటన్‌ శరణార్థిగా ఉండాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dharamveer Singh  BSP  Mayawati  British rule  freedom fighters  Rajasthan  

Other Articles